మహారాణికి కాస్ట్యూమ్స్ రెడీ అవుతున్నాయ్

Update: 2016-06-10 07:08 GMT
శ్రియా శరణ్.. బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలోకి లేట్ గా అయినా.. లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చేసింది. బాలయ్యకు భార్యగా - మహారాణి పాత్రలో శ్రియ ఒదిగిపోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ చిత్రంలోకి హీరోయిన్ ప్రవేశం ఆలస్యమైందనే మాటను ఒప్పుకోవాల్సిందే. గౌతమిపుత్ర శాతకర్ణి పీరియాడిక్ ఫిలిం కావడంతో.. ప్రతీ కేరక్టర్ కు ప్రత్యేకంగా మేకప్ - కాస్ట్యూమ్స్ విషయంలో బోలెడంత వర్క్ చేయాల్సి ఉంటుంది.

గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ కి ఇప్పటికే షెడ్యూల్స్ ఫిక్స్ చేసేయడంతో.. శ్రియ చేస్తున్న మహారాణి పాత్రకు తగినట్లుగా వార్డ్ రోబ్ ని సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. శ్రియ స్కిన్ టోన్ కి, సినిమా కోసం వేసే సెట్స్ కి అనుగుణంగా.. కస్టమైజ్డ్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే భారీగా నగలు - చీరలు ధరించాల్సి ఉండడంతో.. ఇవన్నీ చాలా బరువుగా ఉండనున్నాయి. అందుకే వీటిని మోసుకుంటూ యాక్టింగ్ చేయడంపై.. శ్రియ ట్రైనింగ్ తీసుకుంటోందని తెలుస్తోంది.

అయితే.. బాలయ్యతో నటించడం శ్రియకు ఇదేమీ కొత్త కాదు. గతంలో చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలకృష్ణకు జంటగా నటించిన అనుభవం ఉంది. అందుకే పెయిర్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవని దర్శకుడు అంటున్నాడు. అలాగే బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రావడంతో.. యూనిట్ హ్యాపీగా ఉంది.
Tags:    

Similar News