బికినీ పిక్స్ ఉపయోగం ఏంటో?

Update: 2017-11-06 08:43 GMT
 ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోయిన్ ఎవరు అంటే శ్రియా శరణ్ అనే ఆన్సర్ ఎవరైనా చెప్పేస్తారు. 17 ఏళ్ల నుంచి హీరోయిన్ గా కొనసాగుతున్న హిస్టరీ ఈమె ఖాతాలో ఉన్నా.. ఇంకా ఈమె వయసు జస్ట్ 35 సంవత్సరాలు మాత్రమే. సరిగ్గా 17 ఏళ్ల వయసుకే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. అక్కడి నుంచి హీరోయిన్ గానే కాదు.. అడపా దడపా ఐటెం సాంగుల్లోనూ మెరుస్తోంది.

ఈ మధ్య కాలంలో శ్రియ తన సోషల్ మీడియాలో రచ్చ బాగానే చేస్తోంది. టూపీస్ బికినీలో పిక్స్ షేర్ చేసేందుకు కూడా ఏ మాత్రం సందేహించడం లేదు. ఎప్పుడో ఓసారి అయితే పెద్ద మ్యాటర్ కాదు కానీ.. ఇలా షేర్ చేసే బికినీ పిక్స్ కౌంట్ ఈ మధ్య బాగా పెరిగింది. ఓ రెండు వారాల క్రితం బాలి (ఇండోనేషియా) హాలిడే టూర్ కి వెళ్లినపుడు అండర్ వాటర్ లో తీయించుకున్న ఫోటోలను కూడా జనాలకు చూపించింది. వీటి ద్వారా క్రేజ్ పెంచుకోవాలని ఆశపడుతోంది. శ్రియ ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ఇవి ఉపయోగపడతాయా అన్నదే అసలు విషయం. బికినీ పిక్స్ తో క్రేజ్ తెచ్చుకోవడానికి ఈమె ఏమీ అప్ కమింగ్ హీరోయిన్ కాదు. పోనీ ఫామ్ లో ఉందా అంటే అదీ లేదు.

 దాదాపుగా కెరీర్ ఎండింగ్ స్టేజ్ లో ఉందని చెప్పాలి. పైగా ఫిలిం ఈవెంట్స్ లో డ్యాన్సులకు మినహాయిస్తే.. ఈమె ఏ సినిమాకి ఫస్ట్ ఆప్షన్ కావడం లేదు. మరిప్పుడు ఇలాంటి బికినీ పిక్స్ షేర్ చేసినంత మాత్రాన.. క్రేజ్ పెరిగి.. ఛాన్సులు వస్తాయా.. అసలు ఉపయోగం ఉంటుందా? అంటే సందేహమే.
Tags:    

Similar News