అన్ని స్పెషల్ అంటూనే గబ్బర్ సింగ్ కే ఓటేసింది..

Update: 2020-01-04 04:11 GMT
సన్నటి మెరుపు తీగకు ప్రతిరూపం శృతిహాసన్. తన వాలుచూపులతో యూత్ కు కిక్కు ఎక్కించే విషయం లో సక్సెస్ ఫుల్ గా ఆమెను చెప్పక తప్పదు. కావాలని తీసుకున్న బ్రేక్ నుంచి బయటకు వచ్చి.. రీఎంట్రీ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యక్తిగత విషయాల తో ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న ఆమె.. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనేనని చెబుతోంది.

ఆమె నటించిన సినిమాలెన్నో హిట్.. సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆమె ఆల్ టైం ఫేవరెట్ మాత్రం గబ్బర్ సింగ్ అని తేల్చేసింది. రేసుగుర్రం.. బలుపు.. శ్రీమంతుడు లాంటి సినిమాలు తన కెరీర్ లో ఉన్నప్పటికీ.. వేటికవే స్పెషల్ అంటూనే.. గబ్బర్ సింగ్ మాత్రం ఎప్పటికి స్పెషల్ అని తేల్చేసింది.

మీరు నటించిన హీరోల గురించి సింగిల్ స్టేట్ మంట్ ఇవ్వమన్నప్పుడు మహేశ్ బాబు హ్యాండ్ సమ్ అని.. అల్లు అర్జున్ పట్టుదలకు నిదర్శనమని చెప్పింది. పవన్ కల్యాణ్ స్టైలిస్ అని.. ప్రభాస్ టాల్ అన్న ఆమె చిన్ననాటి క్రష్ ఎవరంటే మాత్రం హాలీవుడ్ హీరోలియనార్డో డికాప్రియోగా చెప్పింది. తన గురించి మాత్రం చెప్పేందుకు పెద్దగా ఇష్టాన్ని ప్రదర్శించలేదు. ప్రేమ కోసం ఎప్పుడూ పోరాడటానికి సిద్ధంగా ఉంటానన్న ఆమె.. ప్రేమను నిర్వచించమంటే మాత్రం.. నడిపించే శక్తి అని తేల్చేసింది.

సౌత్ ఇండియన్ వంటకాలంటే ఇష్టమే కాదు.. వాటిని చక్కగా వండేస్తానని చెప్పింది. అంతేకాదు.. ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏదంటే.. కిచెన్ అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతలోనే.. వాస్తవానికి బాత్రూం అంటే ఇష్టమన్న ఆమె.. అక్కడే తనకు చాలా ఆలోచనలు వస్తాయని చెప్పిది. మీలో మీరు కోరుకునే మార్పు అంటే మాత్రం.. సహనాన్ని మరింత పెంచుకోవాలని చెప్పింది. ఏమైనా శృతిహాసన్ మాటలు మిగిలిన సెలబ్రిటీలకు కాస్త భిన్నంగా అనిపించట్లేదు?


Tags:    

Similar News