టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనగానే ప్రస్తుతం కొన్ని పేర్లు వినిపిస్తాయి. అయితే అందులో శృతి హాసన్ పేరు రెండు మూడు సంవత్సరాలకు ముందు ఉండేది కాని ఆమద్య ఈమె సినిమాలకు బ్రేక్ ఇవ్వడం వల్ల స్టార్ హీరోయిన్ జాబితా నుండి తప్పి పోయింది. కాస్త గ్యాప్ తర్వాత శృతి హాసన్ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో శృతి హాసన్ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతంకు ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉంది.
త్వరలో పవన్ తో చేసిన వకీల్ సాబ్ సినిమాతో శృతి హాసన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో గెస్ట్ రోల్ అయినా కూడా ఖచ్చితంగా శృతి క్రేజ్ మరింత పెరిగేలా చేస్తుంది అంటున్నారు. కనుక శృతి హాసన్ వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉంది. శృతి ఓకే అనాలే కాని స్టార్ హీరోలు మళ్లీ ఆమెతో రొమాన్స్ కు సిద్దంగా ఉన్నారు. క్రాక్ హిట్ తో మళ్లీ స్టార్ హీరోయిన్ జాబితాలో శృతి హాసన్ చేరినట్లే అని మరో రెండు సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ను దక్కించుకుంటే టాప్ స్టార్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. మరి శృతి హాసన్ స్టెప్ ఏంటీ అనేది చూడాలి.