ఇటీవలే శ్రుతి హాసన్ ఆంధ్రా రుచులన్నింటిని రుచి చూస్తున్న సంగతి తెలిసిందే. `సలార్` షూటింగ్ సమయంలో ప్రభాస్ ఆంధ్రాలో ఫేమస్ అయిన అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలన్నింటిని తన చెఫ్ తో తయారు చేయించి శ్రుతి కి ఆన్ లొకేషన్ తినిపిస్తున్నారు. సముద్ర చేపల రుచులు.. అలాగే ఆంధ్రా స్టైల్ నాటుకోడి ఇగురు.. మటన్ కూర ఇలా కొన్ని రకాల వంటకాల్ని పంపించారు. రాజులు బేసిక్ గానే మంచి భోజన ప్రియులు కాబట్టి వాళ్ల స్టైల్ లో అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ని రుచి చూపించారు. డిజెర్ట్స్ పేరుతో ఏకంగా వెరైటీ డిసర్ట్ లను రుచి చూపించాట. ఇలా ఆంధ్రా వంటకాల రుచిని శ్రుతి హాసన్ కి అలవాటు చేశారు. వెజ్ ఐటమ్స్ లో ఆంధ్రా పప్పు రుచి కూడా తనకు నచ్చిందట.
ఇది శ్రుతి హాసన్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్. ఇంత టేస్టీగా వంటలు ఇంత వరకూ ప్రపంచంలోనే ఎప్పుడు ఎక్కడ తినలేదని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆ రకంగా ఆంధ్రా వంటల రుచేంటో శ్రుతి హాసన్ కి తెలిసొచ్చింది. ఇక తమిళనాడు సాంబర్ కూడా వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్సో తెలిసిందే. మరి ఈ రుచులన్నింటినీ ఆరగించిన శ్రుతిహాసన్ మైండ్ లో బిజినెస్ ప్లాన్ కూడా ఉందిట. ఏకంగా ముంబైలో సౌత్ ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ పెడతానని ప్రామిస్ చేసింది.
ముంబైలో ఇలాంటి హోటల్ ప్రారంభించాలని ఎప్పటి నుంచో కలలు కంటోందిట. వంట చేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందులోనూ వండి వడ్డించడం అంటే ఇంకా ఇష్టమట. ఈ మధ్య కాలంలో ఆకలిస్తే ప్రభాస్ వంటకాలు మాత్రమే గుర్తొస్తున్నాయని తెలిపింది. బిజినెస్ ప్రారంభిస్తే గనుక ఆంధ్రా పప్పు.. తమిళనాడు సాంబర్ తన హోటల్ మెనులో తప్పక ఉంటాయని తెలిపింది. మొత్తానికి ప్రభాస్ రుచులు శ్రుతిని ఇంతగా ప్రభావితం చేశాయన్నమాట.