దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగొందిన శృతి హాసన్.. 'కాటమరాయుడు' తర్వాత తెలుగు సినిమా చేయడానికి దాదాపు నాలుగేళ్ల సమయం తీసుకుంది. అయితేనేం 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇదే క్రమంలో 'వకీల్ సాబ్' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో మళ్ళీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన శృతి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'సలార్' లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో అమ్మడు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటుందని భావిస్తుండగా.. ఇటీవలే సీనియర్ హీరో బాలకృష్ణ సరసన నటిస్తున్నట్లు ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే హీరోహీరోయిన్ల మీద క్లాప్ కొట్టి లాంఛనంగా సినిమాని ప్రారంభించారు. అయితే ఈ చిత్రంలో నటించడానికి శృతి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాటుగా కొన్ని కండిషన్స్ కూడా పెట్టినట్లు టాక్ నడుస్తోంది.
శృతి హాసన్ కు ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా చెల్లిస్తున్నారట. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషికమని తెలుస్తోంది. అలానే రొమాంటిక్ సీన్స్ ఇంటిమేట్ సన్నివేశాలు లేకుండా చూడాలని కోరిందట. వీటన్నింటి కంటే ముందు సీనియర్ హీరోకి జోడీగా నటించడానికి ఒప్పుకోలేదట. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఉన్న స్నేహంతో తన షరతులకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ శృతి హాసన్ కండిషన్స్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
కాగా, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి 'జై బాలయ్య' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో శృతి హసన్ తో పాటుగా మరో హీరోయిన్ కూడా భాగం కానుందని టాక్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.