ఇది ప్రస్తుతానికి ఊహ మాత్రమే. కానీ అది నిజమైతే బావుంటుందంటున్నాడు అక్కినేని కుర్రాడు. మహేష్ కు తనకు కొన్ని విషయాల్లో పోలికలున్నాయని.. తనతో కలిసి మల్టీస్టారర్ చేస్తే చాలా బావుంటుందని ఆశ పడుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అఖిల్. ఇంతకీ మహేష్ కు, తనకు ఉన్న పోలిక ఏంటంటే.. ప్రధానంగా కలర్ అంటున్నాడు అక్కినేని కుర్రాడు. తమ ఇద్దరి కలర్ కాంప్లెక్షన్ ఒకేరకంగా ఉంటుందని.. ఇద్దరూ సినీ ఫ్యామిలీస్ లో పుట్టి పెరిగామని.. చిన్నప్పుడే సినిమాల్లో నటించామని చెప్పాడు అఖిల్.
మహేష్ - అఖిల్ ఫ్యామిలీస్ మధ్య మంచి సంబంధాలున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏఎన్నార్ అంటే కృష్ణకు చాలా అభిమానం. ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. ఆ తర్వాత నాగార్జున సినిమా ‘వారసుడు’లోనూ కృష్ణ ఓ ముఖ్య పాత్ర పోషించాడు. మహేష్ ను హీరోగా పరిచయం చేసినపుడు నాగ్ ముఖ్య అతిథిగా వస్తే.. అఖిల్ ఇంట్రడక్షన్ మూవీ ఆడియో ఫంక్షన్ కు మహేష్ వచ్చిన విషెస్ చెప్పాడు. అఖిల్ కాబోయే సూపర్ స్టార్ అని కూడా మహేష్ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ ఇద్దరూ చార్మింగ్ హీరోస్ కలిసి ఓ సినిమా చేస్తే వెండితెర వెలిగిపోదూ!