సింగీతం శ్రీనివాసరావు .. ఈ పేరు వినగానే దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలు .. నిర్మాతగా చేసిన సాహసాలు గుర్తుకు వస్తాయి. సంగీత దర్శకుడిగా .. రచయితగా కూడా ఆయనకి మంచి అనుభవం ఉంది. తెలుగు .. తమిళ ... మలయాళ .. కన్నడ భాషల్లో ఆయన అనేక సినిమాలను తెరకెక్కించారు. 'పుష్పక విమానం' ... ' భైరవ ద్వీపం' ... 'ఆదిత్య 369' వంటి సినిమాలు ఆయన చేసిన ప్రయోగాలకు అద్దం పడతాయి. అలాంటి ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
'భైరవ ద్వీపం' సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ఒక పాటను వేటూరి గారు రాయాలి. గతంలో నా సినిమాలలో చాలా పాటలు ఆయనే రాశారు. కానీ ఈ సారి ఆయన ఇదిగో వస్తున్నాను .. అదిగో వస్తున్నాని అంటున్నారు గానీ రావడం లేదు.
ఆయన రాకపోవడం వలన పని ఆగిపోకూడదనే ఆవేశంతో నేనే ఆ సందర్భానికి తగినట్టుగా ఒక పాట రాశాను. ఆవేశం తగ్గిన తరువాత వేటూరి గారికి మళ్లీ కబురు చేస్తే ఆయన వచ్చారు. నేను రాసిన పాటను చూపించాను .. అది బాగోలేదనిపిస్తే ఆయనను రాయమని అన్నాను. కానీ నేను రాసిన ఆ పాట చాలా బాగుందని ఆయన అన్నారు. అదే 'విరిసినదీ వసంతగానం' సాంగ్.
'భైరవద్వీపం' సినిమాలో బాలకృష్ణ గారిని కురూపిగా చూపించవలసి వచ్చింది. జనం ఎప్పుడూ కూడా ఊహించనవి చేసేవాడే హీరో అనుకుంటారు. అందువలన బాలకృష్ణను ఆ విధంగా చూపించేసరికి వాళ్లంతా ఆశ్ఛర్యపోయారు .. మరింతగా కథలోకి వెళ్లిపోయారు. బాలకృష్ణ గారు ఎంతో గొప్పగా చేశారు అని చెప్పుకున్నారు. ఆ గెటప్ కోసం బాలకృష్ణగారు చాలా కష్టపడ్డారు. 10 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అదే గెటప్ లో ఆయన ఉండేవారు.
ఆ గెటప్ తో భోజనం చేయడం కుదరదు. అందువలన జ్యూస్ లు మాత్రమే ఇస్తుండేవాళ్లం. ఆ జ్యూస్ లు కూడా స్ట్రా తో మాత్రమే తాగేవారు. ఒకరోజున ఒక షాట్ కి సంబంధించిన లైటింగ్ కి సమయం పడుతుందని బాలకృష్ణగారిని మధ్యాహ్నం 12 గంటలకు రమ్మని చెప్పాము.
అదే విషయం ఆయన ఎన్టీఆర్ తో చెప్పారట. "ఒకవేళ లైటింగ్ ముందుగానే ఓకే అయితే నీ ద్వారా షూటింగు లేట్ కాకూడదు .. వెళ్లు" అని బాలకృష్ణగారిని ఎన్టీఆర్ పంపించారు. ఎన్టీఆర్ గారి నుంచే బాలకృష్ణ గారికి ఆ క్రమశిక్షణ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.