మిస్టర్ మజ్ను- రంగ్ దే తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా `సార్`. తమిళంలో `వాతి` పేరుతో విడుదలవుతోంది. ధనుష్ ఈ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ సరసన సంయుక్తా మీనన్ కథానాయిక. చాలా గ్యాప్ తర్వాత డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా సమంత నటించిన పాన్ ఇండియా మూవీ `శాకుంతలం`తో పోటీపడుతూ అదే రోజు (ఈ నెలలో) విడుదలకు సిద్ధమవుతోంది. సేమ్ డే యువహీరో కిరణ్ అబ్బవరం నటించిన `వినరో భాగ్యము విష్ణు కథ` కూడా విడుదలవుతోంది. ఈ సినిమాలకు వారం ముందు కళ్యాణ్ రామ్ నటించిన క్రేజీ సినిమా `అమిగోస్` రిలీజ్ బరిలో ఉంది. అయితే ఈ సినిమాల్లో ప్రచారం పరంగా వెనకబడినది మాత్రం `సార్` (వాతి) సినిమానే అన్న టాక్ వినిపిస్తోంది.
సితార సంస్థ ఎందుకనో `సార్` ని హైడ్ చేస్తోందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ధనుష్ లాంటి స్టార్ కి తెలుగులో ఇంకా పెద్ద మార్కెట్ లేదు. దానికి తోడు వెంకీ అట్లూరి గత రెండు చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. దీంతో సార్ చిత్రానికి హైప్ కూడా కనిపించలేదు. అయితే అనవసర హంగామా హైప్ లేకుండానే కంటెంట్ తో హిట్టు కొట్టాలన్న ఆలోచన దర్శకనిర్మాతలకు ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.
ప్రచారానికి సరిగ్గా రెండు వారాలు కూడా లేదు. అయినా ఇంకా సార్ ఎందుకనో ఈ మౌనం? ఎందుకని ఇంకా ప్రచార బరిలోకి దిగలేదు? అంటూ ఒక సెక్షన్ ప్రశ్నిస్తోంది. మరి దానికి `సార్` ధీటైన సమాధానమిస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.