ధనుష్ ద్విభాషా చిత్రం `సర్` (వాతి-తమిళం)తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా చిత్రబృందం నాయకానాయికలతో కూడుకున్న ఒక అందమైన పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ధనుష్ ఎప్పటిలానే పక్కింటి కుర్రాడిలా ఎంతో నేచురల్ గా కనిపిస్తున్నాడు. సంయుక్త చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. సర్ తో అమ్మయి చూపులు కలిసిన వేళ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా మారింది. ఆ ఇరువురి నడుమా ఏమిటో ఆ గుసగుసలు? అంటూ నెటిజనుల్లోను గుసగుస మొదలైంది.
సర్ ప్రచారం వేగవంతం చేసేందుకు చిత్రబృందం సన్నాహకాల్లో ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి తొలి సింగిల్ ని రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. ధనుష్ నటిస్తున్న ఈ ద్విభాషా చిత్రంపై చక్కని అంచనాలు ఏర్పడుతున్నాయి.
నిజానికి డిసెంబర్ 2 న థియేటర్లలో విడుదల కావాల్సిన సర్/వాతి వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల గుసగుసలు వినిపించాయి. ఈ చిత్రాన్ని 2023 ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు టాక్. కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం.