ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్వి భాషా చిత్రం `సార్`. తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీని ఏక కాలంలో రూపొందించారు. సంయుక్త మీనన్ హీరోయిన్. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ద్వి భాషా చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో `సార్` పేరుతో రూపొందిన ఈ మూవీని తమిళంలో `వాతి` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానుంది.
ఈ నేపత్యంలో తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లోనూ దనుష్ చురుగ్గా పాల్గొంటూ మేకర్స్ కి తన వంతు సహాయ సహకారాల్ని అందిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని బుధవారం సాయంత్రం 5:04 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు హీరో ధనుష్ కూడా పాల్గొన్నాడు. విద్యా విధానంలో వున్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్ తో పాటు ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది. `ఎవర్ సార్ ఆయనా.. నా గురువు బాలు సార్` అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటల్ సర్వీస్.. త్రిపాఠీ ఇనిస్టిట్యూషనల్ తరుపున కొన్ని గవర్నమెంట్ కాలేజీలని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకున్నాం. మీరు కాలేజీకి ఏదో మంచి చేస్తారనిపిస్తోంది. అందుకే వెల్కమ్ టు ద కాలేజ్అం`టూ సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి..డబ్బులున్న వాడే ఈ లెక్కని కొంటాడు..తక్కువున్న వాడు అప్పుచేసైనా కడతాడు... దయచేసి నువ్వు రాజకీయాల్లోకి మాత్రం రాకయా.. ఎడ్యుకేషన్ లో వచ్చే డబ్బు రాజకీయాల్లో రాదు.. వాళ్లు గెలిచా మనుకున్నారు...` అంటూ సాగే సంభాషణలు సినిమా మొత్తం ఎడ్యుకేషన్ మాఫియా నేపథ్యంలో సాగుతుందని, చదువు కోసం తపించే కొంత మంది కోసం ఎడ్యకేషన్ మాఫియాపై తిరగబడే ఓ సార్ సమరంగా ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాల్ని మరింతగా పెంచేస్తోంది. ఎడ్యుకేషన్ మాఫియా నేపథ్యంలో ఇంత వరకు ఎన్నో సినిమాలొచ్చాయి. అయితే ధనుష్ `సార్` మాత్రం అవన్నింటీకీ పూర్తి భిన్నంగా సరికొత్త నేపథ్యంలో తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌నవీన్ నూలి అందించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View