వైజయంతి మూవీస్ నుంచి వచ్చిన ప్రేమ కావ్యం సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందించిన విషయం తెలిసిందే. అసలు ఇలాంటి ప్రేమ కథలు ఈ రోజుల్లో థియేటర్లో సక్సెస్ అవుతాయా అని అందరూ అనుమానిస్తున్న సమయంలో సీతారామం సినిమా ఆ అనుమానాలన్నిటిని కూడా బ్రేక్ చేసి కంటెంట్ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే జనాలు ఎగబడి చూస్తారు అని రుజువు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలి అని డిసైడ్ అయ్యారు.
హిందీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. దాదాపు అది కూడా తెలుగు ట్రైలర్ తరహాలోనే ఉంది. RRR సినిమాను హిందీలో విడుదల చేసిన పెన్ స్టూడియోస్ సీతారామం సినిమా హిందీ రిలీజ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక సెప్టెంబర్ రెండవ తేదీన కొన్ని థియేటర్లలో విడుదల చేసి మంచి టాక్ వచ్చిన తర్వాత కార్తికేయ 2 తరహాలోనే ఆ సంఖ్యను పెంచాలని అనుకుంటున్నారు. ఒక విధంగా సీతారామం సినిమాకు ఇది బాగా కలిసి వచ్చే అంశమే అని చెప్పవచ్చు.
ఇప్పటికే కార్తికేయ సినిమాతో హిందువుల సెంటిమెంట్ బాగా కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు సీతారామం టైటిల్ తోనే ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికి తోడు ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటన ఈ సినిమాలో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా దుల్కర్ ఒక్కడే ఈ సినిమాకు హిందీలో డబ్బింగ్ చెప్పినట్లుగా అనిపిస్తోంది.
ఇక పుష్ప సినిమాతో ఇప్పటికే బాలీవుడ్లో రష్మిక మందన్నకు కొంచెం క్రేజ్ అయితే పెరిగింది కాబట్టి ఆ వైపు నుంచి కూడా హిందీలో కొంత కలిసి వచ్చే అంశం. ఎలాగూ హీరోయిన్ మృనల్ అక్కడ తెలుసు కాబట్టి మరో మేజర్ ప్లస్ పాయింట్.
ఏదేమైనా కూడా సీతారామం టైటిల్ తోనే ఈ సినిమా ఇప్పుడున్న వాతావరణంలోకి హిందీలో మంచి క్రేజ్ అయితే అందుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా హిందీ ఆడియోన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి సినిమా పూర్తి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
హిందీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. దాదాపు అది కూడా తెలుగు ట్రైలర్ తరహాలోనే ఉంది. RRR సినిమాను హిందీలో విడుదల చేసిన పెన్ స్టూడియోస్ సీతారామం సినిమా హిందీ రిలీజ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక సెప్టెంబర్ రెండవ తేదీన కొన్ని థియేటర్లలో విడుదల చేసి మంచి టాక్ వచ్చిన తర్వాత కార్తికేయ 2 తరహాలోనే ఆ సంఖ్యను పెంచాలని అనుకుంటున్నారు. ఒక విధంగా సీతారామం సినిమాకు ఇది బాగా కలిసి వచ్చే అంశమే అని చెప్పవచ్చు.
ఇప్పటికే కార్తికేయ సినిమాతో హిందువుల సెంటిమెంట్ బాగా కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు సీతారామం టైటిల్ తోనే ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికి తోడు ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటన ఈ సినిమాలో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా దుల్కర్ ఒక్కడే ఈ సినిమాకు హిందీలో డబ్బింగ్ చెప్పినట్లుగా అనిపిస్తోంది.
ఇక పుష్ప సినిమాతో ఇప్పటికే బాలీవుడ్లో రష్మిక మందన్నకు కొంచెం క్రేజ్ అయితే పెరిగింది కాబట్టి ఆ వైపు నుంచి కూడా హిందీలో కొంత కలిసి వచ్చే అంశం. ఎలాగూ హీరోయిన్ మృనల్ అక్కడ తెలుసు కాబట్టి మరో మేజర్ ప్లస్ పాయింట్.
ఏదేమైనా కూడా సీతారామం టైటిల్ తోనే ఈ సినిమా ఇప్పుడున్న వాతావరణంలోకి హిందీలో మంచి క్రేజ్ అయితే అందుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా హిందీ ఆడియోన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి సినిమా పూర్తి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.