ఆడియో ఫంక్షన్ అంటే ఏముంటుంది.. యూనిట్ సభ్యుల గురించి రొటీన్ ఏవీలు వేయడం.. ఆ తర్వాత డ్యాన్సర్లు సినిమాలోని పాటలకు స్టెప్పులేయడం.. గెస్టులొచ్చి ఒక్కో సాంగ్ రిలీజ్ చేయడం.. ఆ తర్వాత రొటీన్ ప్రసంగాలు.. ఒకరి మీద ఒకరి పొగడ్తలు. ఆడియో ఫంక్షన్ల వ్యవహారం మరీ రొటీన్ అయిపోతోంది ఈ మధ్య. దీంతో జనాలకు కూడా నెమ్మదిగా ఆడియో ఫంక్షన్ల మీద ఆసక్తి తగ్గిపోతోంది. ఐతే ‘సైజ్ జీరో’ ఆడియో ఫంక్షన్ మాత్రం దీనికి భిన్నంగా సాగింది. ఓ డిఫరెంట్ సినిమా అందించడానికి ప్రయత్నం చేస్తున్న దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ కోవెలమూడి.. ముందు నుంచి ‘సైజ్ జీరో’ ప్రమోషన్స్ కొత్తగా చేస్తున్నాడు. టీజర్లతో ఇప్పటికే సినిమా మీద ఆసక్తి పెంచిన ప్రకాష్.. ఆడియో ఫంక్షన్ కూడా డిఫరెంటుగానే ప్లాన్ చేశాడు.
వేదిక మీద ఓ వెయింగ్ మెషీన్, దాని పక్కనే ఓ సైక్లింగ్ మెషీన్.. వేదిక మీదికి వచ్చిన గెస్టులంతా ముందు సైకిల్ తొక్కాలి. రీడింగ్ ఎంతో చూడాలి. ఆ తర్వాత వెయిట్ చూసుకోవాలి. వెయింగ్ మిషన్లో వెయిట్ టోకెన్ వచ్చాక దాని వెనక ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలి. ఫిట్ గా ఉండటానికి పాటించే టిప్స్ ఏంటో చెప్పాలి. ఓవర్ వెయిట్ మీద, జీరో సైజ్ మీద తమ అభిప్రాయాలు చెప్పాలి. యూనిట్ సభ్యులతో పాటు రాజమౌళి - కీరవాణి - శ్యామ్ ప్రసాద్ రెడ్డి - రానా దగ్గుబాటి లాంటి గెస్టులందరూ పద్ధతిగా గైడ్ లైన్స్ ఫాలో అయ్యారు.
వెయింగ్ మిషన్ ముందు తప్పు తప్పుగా వెయిట్ చూపించింది. రానా వెయిట్ 16 కిలోలని.. కీరవాణి బరువు కేవలం 34 కిలోలని చూపించింది. ఐతే ప్రకాష్ బరువు మాత్రం కరెక్టుగా 84 కిలోలని చూపించింది. ఒక్కొక్కరు తమ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. తాను ఎప్పుడూ డైట్ పాటించనని, స్వీట్లు బాగా తింటానని.. అవి మానేస్తే మామూలైపోతానని రాజమౌళి చెబితే.. లావుగా ఉండటమే సక్సెస్ సీక్రెట్ అన్నాడు కీరవాణి. యాంకర్ నెంబర్ వన్ సుమ.. తనదైన శైలిలో అతిథులతో ఆసక్తికర సంభాషణలతో ప్రోగ్రామ్ ను రక్తి కట్టించింది. మొత్తానికి ‘సైజ్ జీరో’ టీమ్ సినిమాలోనే కాదు.. ఆడియో ఫంక్షన్ విషయంలోనూ తమ క్రియేటివిటీ బాగానే చూపించారు.