మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకొని చాలా కాలం తర్వాత మాస్ మసాలా ఎంటర్ టైనర్ తో బాక్స్ ఆఫీస్ కళకళలాడేలా చేసినా ఇస్మార్ట్ శంకర్ కాస్త నెమ్మదించింది. వీక్ డేస్ లో రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలు డ్రాప్ అవ్వడం సహజమే కాబట్టి మళ్ళీ వీకెండ్ నుంచి పికప్ ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అది కూడా డియర్ కామ్రేడ్ టాక్ ఎలా ఉంటుందనే దాన్ని ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
బుధవారం ట్రెండ్ ని గమనిస్తే మల్టీ ప్లెక్సుల్లో సుమారుగా 40 నుంచి 50 శాతం డ్రాప్ కనిపిస్తోంది. కానీ బిసి సెంటర్స్ తో పాటు సింగల్ స్క్రీన్స్ లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. వేరే ఏ ఆప్షన్ లేకపోవడంతో పాటు మాస్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు టైం పాస్ కోసం ఇస్మార్ట్ శంకరే మంచి ఛాయస్ గా నిలుస్తోంది. అయితే 40 కోట్ల షేర్ మార్క్ ని చేరుకుంటాడా లేదా అనేది ఈ వారాంతంలో వచ్చే వసూళ్లను బట్టి చెప్పొచ్చు
ఇక శుక్రవారం వస్తున్న డియర్ కామ్రేడ్ మీద హైప్ మాములుగా లేదు. మొదటి రోజు విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని టీమ్ ఆశిస్తోంది. హీరో చేసిన విస్తృతమైన ప్రమోషన్ హెల్ప్ అయ్యేలా ఉంది. దానికి తోడు యూత్ ని స్పెషల్ గా టార్గెట్ చేసుకున్న మూవీ కాబట్టి క్రేజ్ ఇంకోలా ఉంది. అయితే మాస్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ డియర్ కామ్రేడ్ లో ఉంటే అది ఇస్మార్ట్ శంకర్ లాంగ్ రన్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ లేకపోలేదు.
అది ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోతుంది. ఇప్పటికే అరవై కోట్ల గ్రాస్ టచ్ చేసిన శంకర్ ఇప్పుడు జోరు కొంత తగ్గింది కాబట్టి టార్గెట్ చేరుకునే స్పీడ్ కూడా తగ్గుతుంది. ఈ రోజు రెండో వారంలోకి ఎంటర్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సెకండ్ వీకెండ్ చాలా కీలకంగా నిలవబోతోంది