ప్రపంచం మొత్తం కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని విలవిల్లాడిపోతోంది. దీని వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. దీని వలన రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఎక్కడా చూసిని వేలాది మంది ఇళ్లకు చేరేందుకు పడుతున్న కష్టాలే కనిపిస్తాయి. రవాణా సౌకర్యాలు అంతగా లేకపోవడంతో కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అంత దూరం సైకిళ్లు మీద వెళ్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండగా నిలబడుతున్నారు. దీంతో అందరూ సోనూసూద్ ని కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అతను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో సోనూసూద్ ను రిక్వెస్ట్ చేస్తూ.. ''సర్ దయచేసి నాకు హెల్ప్ చేయండి. మీరు ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసి యూపీలోని ఏ ప్రాంతానికైనా పంపించండి. అక్కడి నుంచి మా ఊరికి నడుచుకుంటూ వెళ్లిపోతాను'' అని సాయం కోసం అభ్యర్థించాడు. ఆ ట్వీట్ పై స్పందించిన సోనూ సూద్.. ''నడుచుకుంటూ వెళ్లడం ఎందుకు. మీ ఫోన్ నంబర్ పంపండి'' అని రిప్లై ఇచ్చారు. అతనిని ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి సహాయం అందించాడు. ఇలా వలస కూలీలకు తన వంతుగా సాయం చేస్తోన్న సోనూసూద్ ను స్మృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు తను పడుతున్న తపనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు నటుడిగా ఎప్పుడో చాలా ఎత్తుకు ఎదిగారు. మీతో వృత్తి పరంగా మీతో నాకు రెండు దశాబ్ధాల పరిచయం ఉంది సోనూసూద్. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఈ సహాయం మిమ్మల్ని చూసి మరింత గర్వపడేలా చేస్తోంది అని అన్నారు.