తుపాకి చేతికి చిక్కాక ఇంకా ఆలోచించేదేంటీ? `ఘోస్ట్`లా మారి చెలరేగిపోవాల్సిందే. గుళ్ల వర్షం కురిపిస్తూ శత్రువులను మట్టుపెడుతూ కథనరంగలో చకచకా కదలాల్సిందే. ఇదిగో ఇక్కడా ఘోస్ట్ ప్రియా చేస్తున్నది అదే. తుపాకి చేతపట్టి డ్యాషింగ్ గా వార్ జోన్ లోకి దూసుకెళుతోంది. అడ్డొచ్చిన వాళ్లను కత్తులతో పొడిచి గన్స్ తో షూట్ చేస్తూ అదరగొడుతోంది.
ఇంతకీ ఈ ప్రియా ఎవరో పరిచయం అవసరం లేదు. ది గ్రేట్ సోనాల్ చౌహాన్. కింగ్ నాగార్జునతో కలిసి ఘోస్ట్ మూవీ కోసం వార్ జోన్ లో ప్రవేశించింది. ప్రియా అరివీర భయంకరంగా పోరాటాలు చేస్తుందని తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో వెల్లడిస్తోంది. ఒకేసారి గుంపుగా పాతిక మంది శత్రువులు మీదికి ఉరుకుతున్నా ఎవరినీ విడువక కత్తులతో పొడుచుకుంటూ వెళ్లి గన్స్ పేలుస్తూ ప్రియా ప్రదర్శిస్తున్న సాహసాలు ఔరౌరా! అనిపిస్తున్నాయి. సోనాల్ కి కొంత గ్యాప్ తర్వాత అద్భుతమైన అవకాశం దొరికిందని అర్థమవుతోంది. రోప్ లపై సోనాల్ యాక్షన్ ఎపిసోడ్స్ గగుర్పొడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రవీణ్ సత్తారు లాంటి ట్యాలెంటెడ్ దర్శకుడితో `ఘోస్ట్` లాంటి విభిన్నమైన సినిమాని ప్లాన్ చేసారు నాగార్జున. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ఫస్ట్ లుక్ దూసుకెళ్లింది. టీజర్ యూనివర్శల్ అప్పీల్ తో ఆకట్టుకుంది. కింగ్ ఈసారి యూనిక్ స్టైల్లో కొత్తగా ట్రై చేస్తున్నారని కూడా టాక్ వినిపించింది. అటు బాలీవుడ్ మీడియాలోనూ టీజర్ కి భారీ ప్రచారం దక్కింది. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శరత్ మరార్ తో కలిసి సునీల్ నారంగ్ - నారాయణ్ దాస్ నారంగ్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ లో నాగార్జున విక్రమ్ అనే పాత్రలో కనిపిస్తారు. ఇందులో గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ కూడా ప్రధాన తారాగణంలో ఒక భాగం. ఈ చిత్రానికి ముఖేష్ జి కెమెరా వర్క్ అందించగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. దినేష్ సుబ్బరాయన్ - కేచా యాక్షన్ డ్రామా కోసం హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించగా.. మార్క్ కె రాబిన్ ది ఘోస్ట్ కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని బాణీలను అందిస్తున్నారు.
రణబీర్ కపూర్ - అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రలో కూడా నాగార్జున ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదలవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Not just blood and sweat but a few bones too….
— SONAL CHAUHAN (@sonalchauhan7) September 7, 2022
Making of PRIYA. A lot more to come !!! #TheGhost #TheGhostOnOct5@iamnagarjuna @PraveenSattaru @SVCLLP @nseplofficial @SonyMusicSouth #SonalChauhan pic.twitter.com/IccYwIr7Kz