పిక్ టాక్ : బుల్లి తెర దేవత ఇప్పుడు అందాల దేవత

Update: 2023-07-08 09:25 GMT
దేవొన్‌ కా దేవ్ మహాదేవ్‌ సీరియల్‌ లో పార్వతి దేవిగా నటించిన సోనారిక భాడోరియా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెర సీరియల్స్ తో పాటు వెండి తెర ద్వారా కూడా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ సినిమాలతో ఆమె సక్సెస్ అవ్వలేక పోయింది.

ముంబై లో జన్మించిన సోనారిక భాడోరియా సినిమా రంగం కు చెందిన ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ అవ్వడం వల్ల ఎంట్రీ ఈజీగా లభించింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో అమ్మడికి సక్సెస్‌ లు దక్కలేదు. చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా అవి నిరాశ పరచడం తో ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమా మరియు సీరియల్స్ లో కనిపించడం లేదు.

హీరోయిన్‌ గా సోనారిక భాడోరియా సినిమాలు చేసినా చేయకున్నా ఇలా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ అందరిని అలరిస్తూ ఉంది. ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం అంటూ పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

మంచి ఫిజిక్ తో పాటు ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందాల ముద్దుగుమ్మ.. అందాల దేవత ని సినీ జనాలు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా సోనారిక భాడోరియా కి సినీ ఆఫర్లు వస్తాయో చూడాలి.

Similar News