మూవీ రివ్యూ : 'స్పై'
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్ - ఐశ్వర్య మీనన్ - శాన్య ఠాకూర్- నితిన్ మెహతా -రానా దగ్గుబాటి - అభినవ్ గోమఠం - మకరంద్ దేశ్ పాండే- జిషు సేన్ గుప్తా- సచిన్ ఖేద్కర్- ఆర్యన్ రాజేష్- తనికెళ్ల భరణి-రవి వర్మ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్-శ్రీ చరణ్ పాకాల
నేపథ్య సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు - మార్క్ డేవిడ్
రచన: అనిరుధ్ కృష్ణమూర్తి
కథ - నిర్మాత: రాజశేఖరరెడ్డి
దర్శకత్వం: గ్యారీ బీహెచ్
గత ఏడాది 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ కొట్టి తన రేంజ్ పెంచుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇప్పుడు అతను 'స్పై' అవతారం ఎత్తాడు. ట్రైలర్ చూస్తే ఇది కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా లాగే కనిపించింది. మంచి అంచనాలతో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్పై' విశేషాలు ఏంటో చూద్దాం పదండి.
కథ:
జై (నిఖిల్ సిద్దార్థ్) 'రా' కోసం పని చేసే సీక్రెట్ ఏజెంట్. ఖాదిర్ (నితిన్ మెహతా) అనే ఒక ప్రమాదకర అంతర్జాతీయ క్రిమినల్ ను అంతమొందించే మిషన్లో భాగంగా జై అన్న సుభాష్ (ఆర్యన్ రాజేష్) ప్రాణాలు కోల్పోతాడు. సుభాష్ చేతుల్లో చనిపోయాడనుకున్న ఖాదిర్.. మళ్లీ బతికి కనిపించడమే కాక ఇండియా మీద ఒక ఎటాక్ కూడా చేయబోతున్నట్లు మెసేజ్ ఇవ్వడంతో అతడి ఆచూకీ కనిపెట్టే మిషన్ ను 'రా' చీఫ్ జైకి అప్పగిస్తాడు. జై ఈ పనిలో ఉండగానే.. సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన ఫైల్ 'రా' నుంచి మిస్ అవుతుంది. ఇండియా మీద జరగబోయే దాడిలో ఈ ఫైల్ కీలకం అని తెలియడంతో జై మీద దీన్ని కనిపెట్టే బాధ్యత కూడా జై మీదే పడుతుంది. మరి చనిపోయాడనుకున్న ఖాదిర్.. మళ్లీ ఎలా బతికి వచ్చాడు? మిస్ అయిన ఫైల్ సంగతేంటి? ఖాదిర్ ను కనిపెట్టి తన అన్న మరణానికి జై ప్రతీకారం తీర్చుకున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెర మీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
'స్పై'లో చనిపోయాడనుకున్న విలన్ మళ్లీ ఎలా బతికి వచ్చాడో కనిపెట్టేందుకు వెళ్లిన హీరో.. ఆ మర్మమేంటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ విలన్ తో కలిసి కార్లో ప్రయాణిస్తూ పెట్రోలు బంకులోకి వెళ్లిన వీడియో ఒకటి లీక్ అవుతుంది. అందులో విలన్ మీద చెయ్యి వేసి నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తాడు హీరో. ఈ వీడియో ఇలా లీక్ అవడం ఆలస్యం.. 'రా' చీఫ్ అది చూసి హీరో కాంప్రమైజ్ అయిపోయాడని క్షణాల్లో తేల్చేస్తాడు. వెంటనే హీరోను 'రోగ్ ఏజెంట్' అని డిక్లేర్ చేసి అతణ్ని పట్టుకోవాలని.. లేదంటే చంపేయాలని ఆర్డర్స్ ఇస్తాడు. అన్నేళ్లు సిన్సియర్ గా పని చేస్తున్న ఏజెంట్.. కేవలం విలన్ తో నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన అతను ద్రోహిగా మారిపోయాడని 'రా' చీఫ్ ఫిక్సయిపోవడం.. అతణ్ని చంపేయమని ఆర్డర్స్ ఇవ్వడం ఏంటో.. హీరో ఫోన్ చేసి కీలకమైన సమాచారం ఇస్తున్నా పట్టించుకోకుండా అతణ్ని అపార్థం చేసుకోవడం ఏంటో అర్థం కాదు. పోనీ ఇదంతా మిషన్లో భాగంగా ఆడిన డ్రామానేమో అనుకుంటే అది కూడా కాదు. 'రా' చీఫ్ నిజంగానే హీరోను అపార్థం చేసుకున్నట్లు చూపిస్తారు. 'రా' అనగానే అత్యున్నత స్థాయిలో ఊహించుకుంటాం. ఒక ఇంటెన్సిటీతో చూస్తాం. దాన్ని నడిపించే వ్యక్తి పాత్రను ఇంత సిల్లీగా డిజైన్ చేసి.. సన్నివేశాలను ఇంత వేగ్ గా నడిపిస్తే.. స్పై థ్రిల్లర్ మూవీని ఎలా సీరియస్ గా తీసుకుంటాం?
స్పై థ్రిల్లర్ అనగానే ఊరికే యాక్షన్ ఘట్టాలతో నింపేస్తే సరిపోదు. కథలో బలం ఉండాలి. కథనం పరుగులు పెట్టాలి. అన్నింటికీ మించి సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తించాలి. ఐతే 'స్పై'లో ప్రధానంగా ఆ థ్రిల్ యే మిస్సయింది. సుభాష్ చంద్రబోస్ తో ముడిపెట్టి కథను అల్లుకున్న విధానం బాగానే ఉన్నా.. ఆ కథను అనుకున్నంత ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయడంలో 'స్పై' టీం ఫెయిలైంది. ముందే అన్నట్లు ఈ కథలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయలేకపోయారు. ఒకదాని తర్వాత ఒకటి యాక్షన్ ఘట్టాలు వస్తూ పోతుంటాయి తప్ప తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తించలేకపోయారు. సీక్రెట్ ఏజెంట్ సినిమా అనగానే.. పై అధికారి హీరో పేరు చెప్పి అతను ఎక్కడ అనడం.. ఆ వెంటనే హీరో అప్పటికే టేకప్ చేసిన ఒక మిషన్లో తన సాహసాలను చూపించడం.. ఇలా ఒక సగటు ఇంట్రో సన్నివేశంతో మొదలయ్యే 'స్పై'.. ఆ తర్వాత కూడా చాలా వరకు సాదాసీదా సన్నివేశాలతోనే సాగిపోతుంది. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ అయితే మరీ పేలవంగా తీర్చిదిద్దారు.
'స్పై' ట్రైలర్ చూసినపుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.. సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన లింకే. ఎప్పుడో 1945లోనే చనిపోయినట్లుగా భావించే బోస్ తో ఇప్పటి కథకు ఎలా కనెక్ట్ చేస్తారు.. దీన్ని ఎలా రక్తి కట్టిస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ కలిగింది. నిజానికి కథ వరకు చూసుకుంటే ఆ పాయింట్ ను బాగానే డీల్ చేశారు. బోస్ చుట్టూ ఒక అరగంట కథనాన్ని ఆసక్తికరంగానే నడిపించారు.
చరిత్రలో సామాన్య జనాలకు తెలియని కొత్త విషయాలను సినిమాలో చర్చించిన విధానం బాగానే అనిపిస్తుంది. కానీ విలన్ సహా సినిమాలోని ముఖ్య పాత్రలను సరిగా తీర్చిదిద్దకపోవడం.. హీరో చేపట్టిన మిషన్లో ఇంటెన్సిటీ లేకపోవడం నిరాశ పరుస్తుంది. విలన్ ఎంత ప్రమాదకరం అనే విషయాన్నే సరిగా చూపించలేకపోయారు. ముందు విలన్ని చూసి భయపడితే.. ఆ తర్వాత అతను చేయబోయే ఎటాక్ విషయంలో భయం కలుగుతుంది. అప్పుడు హీరో చేసే సాహసం థ్రిల్ ఇస్తుంది. ఆ పాత్ర కూడా ఎలివేట్ అవుతుంది. కానీ వినడానికి ఆసక్తికరంగా అనిపించే విషయాలను తెరపై ప్రభావవంతంగా ప్రెజెంట్ చేయకపోవడం వల్ల 'స్పై' ఎక్కడా అనుకున్నంత ఇంటెన్స్ గా అనిపించదు. విలన్ విషయంలో బయటికి కనిపించే ముఖం ఒకటి.. తెర వెనుక ఉన్నది వేరొకరు అనే విషయాన్ని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే రీతిలో చూపించే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోలేదు. కథలో కీలకమైన ఇలాంటి ట్విస్టులను కూడా సరిగా ప్రెజెంట్ చేయకపోవడం మైనస్ అయింది.
శ్రీలంక.. మయన్మార్.. అమెరికా.. ఖాట్మండు.. పాకిస్థాన్.. చైనా.. ఇలా సినిమాలో ఎన్నో దేశాల పేర్లు వినిపిస్తాయి. కథ కూడా ఎక్కడెక్కడో నడుస్తున్నట్లు చూపిస్తారు. ఖర్చు కూడా బాగానే పెట్టిన విషయం తెరపై కనిపిస్తుంది. ముఖ్య పాత్రలకు పేరున్న నటీనటులనే తీసుకున్నారు. కథ పరిధి కూడా పెద్దదే. మొత్తంగా ఒక ప్రపంచ స్థాయి థ్రిల్లర్ తీయడానికి తగ్గ సెటప్ కుదిరింది. కానీ ఈ కథను ఆసక్తికరంగా చూపించే కథనం.. దర్శకత్వ ప్రతిభ లోపించడంతో 'స్పై' అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. ఓటీటీల్లో ప్రపంచ స్థాయి స్పై థ్రిల్లర్లను చూస్తున్న ఈ రోజుల్లో.. ఇలాంటి కథనంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం చాలా కష్టం. అనేక లూజ్ ఎండ్స్.. తక్కువ నిడివిలో కూడా బోర్ కొట్టించే సన్నివేశాల వల్ల 'స్పై' ఒక సాధారణ సినిమాగా తయారైంది.
నటీనటులు:
జై పాత్రను పండించడానికి నిఖిల్ సిద్దార్థ్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. స్పై పాత్రకు అతను సూటయ్యాడు. తన లుక్ బాగుంది. నటన కూడా పాత్రకు తగ్గట్లుగా సాగింది. కానీ మిగతా క్యారెక్టర్లు.. తన పాత్రను కాంప్లిమెంట్ చేయలేకపోయాయి. సినిమా అంతా నిఖిల్ పక్కనే ఉండే మరో ఏజెంట్ పాత్రలో అభినవ్ గోమఠం తన మార్కు పంచులతో నవ్వించడానికి ప్రయత్నించాడు. కానీ కేవలం కామెడీ కోసమే ప్రయత్నించడంతో ఆ పాత్ర ఔచిత్యం దెబ్బ తింది. హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ శుద్ధ వేస్టు. ఏజెంట్ పాత్రకు ఆమె లుక్స్.. నటన ఏమాత్రం సూట్ కాలేదు. తన పాత్ర పూర్తిగా తేలిపోయింది. ఇంకో అమ్మాయి శ్రావ్య ఠాకూర్ పర్వాలేదు. మకరంద్ దేశ్ పాండే పాత్ర కామెడీగా తయారైంది. నితిన్ మెహతానైతే జోకర్ లాగా చూపించారు. మెయిన్ విలన్ పాత్రలో జిషు సేన్ గుప్తా పర్వాలేదనిపించాడు. కానీ తన పాత్రలోనూ బలం లేకపోయింది. సచిన్ ఖేద్కర్.. తనికెళ్ల భరణి.. సురేష్.. వీళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం:
విశాల్ చంద్రశేఖర్.. శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు సోసోగా అనిపిస్తాయి. శ్రీ చరణ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలకు పేరుబడ్డ అతను.. ఇందులోనూ తన పనితనం చూపించాడు. ఛాయాగ్రహణం బాగానే సాగింది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. బాగానే ఖర్చు పెట్టారు. నిర్మాత రాజశేఖర్ రెడ్డే ఈ చిత్రానికి కథ కూడా అందించాడు. అందులో విషయం ఉంది. కానీ ఆ విషయాన్ని ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేసే స్క్రీన్ ప్లే.. దర్శకత్వ ప్రతిభ కొరవడ్డాయి. ఈ చిత్రంతోనే దర్శకుడిగా మారిన ఎడిటర్ గ్యారీ బీహెచ్.. పకడ్బందీగా సినిమాను నడిపించలేకపోయాడు. యాక్షన్ ఘట్టాలు.. సుభాష్ చంద్రబోస్ ఎపిసోడ్ వరకు కొంత పనితనం చూపించినా.. ఓవరాల్ గా సినిమాను అతను ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయాడు.
చివరగా: స్పై.. ఓన్లీ యాక్షన్.. నో థ్రిల్
రేటింగ్: 2.25/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater