గతం ఎలా ఉన్నా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఇప్పుడు చాలా ఆనందంగా కనిపిస్తోంది. 2016 మార్చ్ 28 న ఈమె తన బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంటే నిన్నటితో రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి వీళ్ళ పెళ్లి అయ్యి. అయినా వారి మధ్య ప్రేమ అలాగే ఉందని వీళ్ళను చూస్తేనే అర్థమైపోతుంది మనకి.
ఇద్దరు సోషల్ మీడియా లో ఎప్పుడు యక్టీవ్ గా ఉంటూ వాళ్ళ జీవితంలో ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫాన్స్ కి తెలియజేస్తూ ఉంటారు. అలాగే రెండవ వివాహ వార్షికోత్సవం గురించి కూడా ఫాన్స్ తో చాలా సంతోషంగా పంచుకున్నారు. శ్రీజ అయితే తన జీవితంలో తను తీసుకున్న మంచి నిర్ణయం తన భర్తే అని కితాబిచ్చింది. కళ్యాణ్ తో దిగిన కొన్ని ఫోటోలను కొల్లాజ్ చేసి పెట్టి తన ప్రేమను తెలిపింది. కళ్యాణ్ కూడా ఎం తక్కువ తినలేదు అండోయ్.
"నువ్వే నా బలం. హ్యాపీ యానివెర్సరీ" అంటూ తన భార్యకు శుభాకాంక్షలు చెప్పాడు మెగా అల్లుడు. కళ్యాణ్ దేవ్ గా మారి హీరో అయిపోయాడు కళ్యాణ్. రాకేష్ శశి దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.