సోద‌రుడికి బిజినెస్ లో శ్రీ‌జ సాయం?

Update: 2022-01-31 02:44 GMT
మ‌నిషి లైఫ్ లో కొన్ని ప‌రిణామాలు  క‌ళ్లు మూసి తెరిచే లోపు చ‌క‌చ‌కా జ‌రిగిపోతుంటాయి. అందుకు సెల‌బ్రిటీలేమీ అతీతులు కాదు. ఏది ఏమైనా వ్య‌క్తిగ‌త జీవితాల్లో ఒడిదుడుకుల్ని అధిగ‌మించి ముందుకు వెళ్ల‌డం విద్యుక్త‌ధ‌ర్మం. ప్ర‌స్తుతం మెగా డాట‌ర్ శ్రీ‌జ కొణిదెల త‌న త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి సారించిన‌ట్టే క‌నిపిస్తోంది.

శ్రీ‌జ తన సోదరుడు రామ్ చరణ్ తో కలిసి ముంబైలో కనిపించ‌డం ర‌క‌ర‌కాల స్పెక్యులేష‌న్స్ కి తావిచ్చింది. చ‌ర‌ణ్ కి సంబంధించిన వ్యాపార లావాదేవీల‌ను శ్రీ‌జ హ్యాండిల్ చేయ‌నున్నార‌ని తెలిసింది. బ్రాండ్ ఎండార్స్ మెంట్ కోసం సోద‌రునితో క‌లిసి శ్రీ‌జ‌ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అంతేకాదు..ఆమె తన సోదరుడితో క‌లిసి ఉన్న ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేశారు. చరణ్ తో వారి చార్టర్డ్ ఫ్లైట్ లో ఉన్న‌ప్ప‌టి ఫోటోగ్రాఫ్ ఇది. ఈ ఫోటో బ‌య‌టికి వ‌చ్చాక ర‌క‌ర‌కాల ఊహాగానాలు.

చ‌ర‌ణ్ ఇప్ప‌టికే న‌టుడిగా నిర్మాత‌గా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందువ‌ల్ల వ‌ర్క్ లైఫ్ ని వ్య‌క్తిగ‌త జీవితాన్ని బ్యాలెన్స్ చేయ‌డానికి సోద‌రి స‌హ‌కారం తీసుకోనున్నారు. అందుకే చరణ్ తన వ్యాపార వ్యవహారాలన్నీ ఆమె సోదరికి అప్పగిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

తన సినిమాల నిర్మాణంలో ఇక‌పై శ్రీ‌జ భాగ‌స్వామి కానున్నారని గుస‌గుస వినిపిస్తోంది. చ‌ర‌ణ్ మ‌రో సోద‌రి.. ఫ్యాష‌న్ డిజైన‌ర్ సుస్మిత ఇప్పటికే నిర్మాతగా స్థిరపడ్డారు. వెబ్ సినిమాలు.. OTT కంటెంట్ నిర్మాణంలో బిజీ అయ్యారు. శ్రీ‌జ కూడా ఇక‌పై నిర్మాత‌గా ఓన‌మాలు దిద్దుతార‌ని నిర్మాణంలో పాలు పంచుకుంటార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News