ప్రభుత్వంకు నమ్మకం కలిగించే బాధ్యత తీసుకున్న జక్కన్న

Update: 2020-05-22 04:30 GMT
మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో షూటింగ్స్‌ కు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. పక్క రాష్ట్రం ఏపీ షూటింగ్స్‌ కు అనుమతించగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం షూటింగ్స్‌ విషయంలో వెనుక ముందు ఆడుతుంది. షూటింగ్‌ అంటే వందలాది మంది పాల్గొంటారు. పలు చోట్ల నుండి వస్తారు. కనుక వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ షూటింగ్‌ ల అనుమతిని వాయిదా వేస్తూ వస్తోంది.

తాజాగా చిరంజీవి ఇంట్లో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంలో మరోసారి ప్రభుత్వంను అనుమతుల కోసం కోరడం జరిగింది. తక్కువ మంది క్రూ తో సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్స్‌ చేసుకుంటామంటూ హామీ ఇచ్చారు. అది సాధ్యం కాదని భావిస్తున్న ప్రభుత్వంకు రాజమౌళి సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ జరిపి మరీ నిరూపించాలని భావిస్తున్నారు.

చిరంజీవితో పాటు పలువురు ఆ బాధ్యతను రాజమౌళికి అప్పగించారు. తక్కువ మంది కాస్ట్‌ అండ్‌ క్రూ తో షూటింగ్‌ నిర్వహించి ప్రభుత్వం ముందుకు వెళ్లబోతున్నారు. జక్కన్న తక్కువ మందితో తీస్తే ఇతర మేకర్స్‌ కు ఖచ్చితంగా అనుమతులు వస్తాయని అంటున్నారు. అందుకే రాజమౌళి ఈ బాధ్యత తీసుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News