మూడవ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ కపుల్‌

Update: 2021-01-08 08:00 GMT
దర్శకుడిగా తన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సెల్వ రాఘవన్ వైవాహిక జీవితం కూడా సినిమాటిక్ గా సాగింది. హీరోయిన్ సోనియా అగర్వాల్ ను 2006 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈయన 2008 లో ఆమె నుండి విడిపోయాడు. సెల్వ రాఘవన్‌.. సోనియా అగర్వాల్ లకు 2010లో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. విడాకుల తర్వాత ఇద్దరు వారి వారి వ్యక్తిగత జీవితాలతో బిజీ అయ్యారు. సెల్వ రాఘవన్ తన వద్ద అసిస్టెంట్ గా చేసే గీతాంజలిని ప్రేమించి ఆమెను 2011లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2012లో లీలావతి, 2013లో ఓంకార్ లు జన్మించారు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ గీతాంజలి మూడవ సారి గర్బం దాల్చింది.

ఇటీవలే ఆమె తన ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తాజాగా ఆమె తన మూడవ బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి స్టార్ కపుల్‌ తమకు పుట్టిన అబ్బాయికి రిషికేష్‌ సెల్వరాఘవన్‌ అంటూ పేరు పెట్టారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే గీతాంజలి తన మూడవ బిడ్డకు స్వాగతం చెబుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. సెల్వ రాఘవన్ స్వయానా తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కు సోదరుడు అనే విషయం తెల్సిందే. తెలుగులో సెల్వ రాఘవన్‌ పలు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయనే టాక్ ఉంటుంది.
Tags:    

Similar News