స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్ట్యూమ్ సెలక్షన్ గురించి చెప్పాల్సిన పనేలేదు. తన సినిమాలో సందర్భానికి తగ్గట్టు అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించేందుకు ఆసక్తి కనబరుస్తాడు. ఇతర స్టార్లతో పోలిస్తే స్టైల్ కంటెంట్ ఎక్కువే. అయితే అదంతా దేనివల్ల వచ్చింది అంటే.. అతడికి ఉన్న ఖరీదైన షాపింగ్ హ్యాబిట్ వల్లనే. హైదరాబాద్ సెంట్రల్లోనో లేక లోకల్ మాల్స్ లోనో షాపింగ్ చేస్తే అంత సీనుంటుందా? అందుకే బన్ని ప్రతిసారీ తన కాస్ట్యూమ్స్ కోసం విదేశాలకు వెళుతుంటాడు. ముఖ్యంగా హాంకాంగ్.. దుబాయ్ .. సింగపూర్ వంటి చోట్ల షాపింగుకి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక లేటెస్టు మూవీ కోసం ఇప్పుడు ప్యారిస్ లాంటి సుదూర దేశానికి వెళ్లిపోవడం ఆసక్తిని కలిగిస్తోంది.
ప్రస్తుతం `అల వైకుంఠపురములో` సాంగ్ షూట్ కి చిత్రబృందం రెడీ అవుతున్నారు. అయితే ఈ పాట చిత్రీకరణలో పాల్గొనక ముందే బన్ని కాస్ట్యూమ్స్ కోసం ప్యారిస్ వెళ్లారు. ప్యారిస్ లో గ్యాలరీస్ లఫయెట్ అండ్ ప్రింటెంప్స్ అనే ప్రఖ్యాత మాల్స్ లో అతడు కాస్ట్యూమ్స్ కొన్నాడు. మార్క్ జోకబ్స్- లాడర్ -మెర్సి- ప్రద అనే ప్రఖ్యాత బ్రాండ్ దుస్తుల్ని కొనుక్కున్నాడు. ఇక ఇదే చోట అల్లు అర్జున్ తో పాటు కథానాయికకు కూడా షాపింగ్ చేసారని తెలుస్తోంది.
ఫ్యాషన్ పుట్టిల్లుగా వర్ధిల్లుతున్న ప్యారిస్ లో దొరకని డిజైనర్ డ్రెస్ ఉంటుందా? అందుకే బన్ని టీమ్ అంత దూరం వెళ్లారని అర్థమవుతోంది. అదొక్కటే కారణం కాదు.. ప్యారిస్ లో ఆ ప్రత్యేక బ్రాండ్స్ రిలీజైన మూడు నెలల్లోపే కొనుక్కోవాలి. లేదంటే స్టాక్ క్లియరెన్స్ చేసేస్తుంటారు. అందుకే బన్ని ప్రత్యేకించి అక్కడ షాపింగ్ ని ప్రిఫర్ చేశాడట. దుబాయ్ తర్వాత మళ్లీ తనకు నచ్చే డిజైనర్ దుస్తులు దొరికేది ప్యారిస్ అని దీనిని బట్టి అర్థమవుతోంది.