అతనో స్టార్ హీరో. మాస్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా.. కష్టపడి స్టార్ ఇమేజ్ సంపాదించాడు. అతడి మీద అటు ఇండస్ట్రీలో.. ఇటు ప్రేక్షకుల్లో చాలా మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఈ మధ్య ఆ హీరో బాగా డబ్బు మనిషి అయిపోయాడన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే తరహాలో డబ్బు విషయంలో మరీ పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో ఆ హీరోతో అనుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. ఇదంతా ఒక ఎత్తయితే.. అతను నిర్మాతలతో చేస్తున్న డీలింగ్స్ మరో ఎత్తు.
మామూలుగా నిర్మాతలు సినిమాలకు పెట్టుబడిగా సొంత డబ్బులు పెట్టరు. ఫైనాన్సులు తెచ్చుకుంటారు. వడ్డీలు భారీగా ఉన్నా సరే.. ఫైనాన్షియర్లనే ఆశ్రయిస్తారు. ఐతే ఫైనాన్స్ విషయంలో ఎవరి దగ్గరికో వెళ్లడమెందుకని ఈ హీరో తనే ఆఫర్ ఇస్తాడట. ఆ హీరో సినిమాల బడ్జెట్ రూ.30 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. ఆ మొత్తం ఆ హీరోనే ఇచ్చి.. తన పారితోషకం కింద రూ.8-9 కోట్ల దాకా ఉంచేసుకుంటాడు. మిగతా మొత్తం నిర్మాత చేతికిచ్చి.. చివరికి వచ్చేసరికి మొత్తం రూ.30 కోట్లకు వడ్డీలు లెక్క గట్టి అణా పైసలతో సహా వసూలు చేస్తాడట. ఈ విషయంలో అతను చాలా కచ్చితంగా కూడా ఉంటాడని సమాచారం. ఒకప్పుడు నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న ఆ స్టార్ ఈ మధ్య మరీ ఇంత డబ్బు మనిషి అయిపోయాడేంటని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.