థర్డ్ వేవ్ దాదాపు తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా థియేటర్లన్నీ కోవిడ్ నిబంధనల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీకి పరిమితమైన థియేటర్లు ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీ నిర్వహణతో ముందుకొస్తున్నాయి. మాస్క్..శానిటైజేషన్ ని మాత్రమే తప్పనిసరి చేసి సినిమాహాళ్లను యాధావిధిగా నిర్వహించవచ్చని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడంతో థియేటర్లన్నీ సినిమాలతో కళకళలాడుతున్నాయి. తాజాగా నేటి నుంచి కేరళ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఆంక్షలు ఎత్తివేసింది. 50 శాతం ఆక్యుపెన్సీని ఎత్తవేసి 100 శాతం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాలీవుడ్ సినిమాలకు లైన్ క్లియర్ అయింది.
షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న సినిమాలన్నీ రిలీజ్ తేదీల్నీ ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ శుక్రవారం మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన `భీష్మపర్వం` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంకా పలు సినిమాలు రిలీజ్ తేదీల్ని ప్రకటిస్తున్నాయి. అయితే కేరళ ముందునుంచి వైరస్ విషయంలో ముందొస్తు జాగ్రత్తలు తీసుకుంది. ముందుగానే ఆక్షలు విధించడం దగ్గర నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాల నిషేధం వరకూ కఠినంగా వ్యవహరించింది. తాజాగా పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటంతో నిబంధల్ని ఎత్తివేసింది. అయితే మహరాష్ర్ట ప్రభుత్వం మాత్రం ఇంకా ఆంక్షల్ని ఎత్తివేయలేదు.
అక్కడ ఇంకా 50 శాతం ఆక్యుపెన్సీతో నే థియేటర్లను రన్ చేయాలన్న ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. దీంతో 50 శాతం ఆక్యుపెన్సీని అమలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ర్టంగా మహరాష్ర్ట నిలిచింది. కేసులు పూర్తిగా తగ్గిన తర్వాత అన్ని రకాల అనుమతులతో పాటు..100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చే అవకాశం ఉందని..అందుకు మరో రెండు..మూడు వారాల పాటు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా కేటగిరి చిత్రాలు `రాధేశ్యామ్`...`ఆర్ ఆర్ ఆర్` లకు లైన్ క్లియర్ అవుతుంది.
ఈ చిత్రాల్ని బాలీవుడ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ రైట్సై్ సైతం భారీ ధరకు విక్రయించారు. తాజా ఆక్షల నేపథ్యంలో రిలీజ్ అయితే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అయితే `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి ఇంకా సమయం ఉంది. కాబట్టి `ఆర్ ఆర్ ఆర్` సేఫ్ జోన్ లో ఉన్నట్లే. కానీ `రాధేశ్యామ్` మార్చి 11న రిలీజ్ అవుతుంది. ఆంక్షలు తొలగిపోవడానికి కనీసం రెండు..మూడు వారాలు సమయం అంటే `రాధేశ్యామ్` 50 శాతం ఆక్యుపెన్సీతో హిందీలో రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది.
అలాగే పలు బాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలు కూడా రిలీజ్ తేదీల్ని ప్రకటిస్తున్నాయి. వాటికి కొన్ని వారాల పాటు ఇబ్బంది తప్పదు. విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` కూడా ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది. తెలుగు..హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది దేవరకొండకి బాలీవుడ్ ఎంట్రీ మూవీ. చిత్రీకరణ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ రిలీజ్ తేదీ మాత్రం ఆగస్టు వరకూ వెళ్లింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలోనే పూరి అంత వరకూ వాయిదా వేసారా? అన్న కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. పూరి సినిమా రిలీజ్ కి ఇంత గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు.
`లైగర్` షూటింగ్ సహా రిలీజ్ కి ఎక్కువ సమయం తీసుకోవడం గమనార్హం. ఇలా అన్ని రాష్ర్టాలు కోవిడ్ నిబంధనలు ఎత్తేసినా మహరాష్ర్ట కొనసాగించడంపై గతంలో నటి కంగనా రనౌత్ సీఎం ఉద్దవ్ ఠాక్రే పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మహరాష్ర్ట ప్రభుత్వం సినిమాల విషయంలో కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోదనీ క్వీన్ మండిపడింది.