ఫార్మల్ అండ్ క్యాజువల్స్ లో స్టైలిష్ రౌడీ బాయ్..!

Update: 2022-03-31 07:31 GMT
సెన్సేషనల్ స్టార్‌ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూట్ తో అందరిని ఆకట్టుకొని యూత్ ఐకాన్ గా పిలవబడుతున్నాడు. స్టైలింగ్ విషయంలోనూ వేడిని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.

టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'లైగర్' సినిమాతో నార్త్ లో అడుగుపెడుతున్న వీడీ.. అక్కడ కూడా అందరికీ ఫేవరేట్ హీరోగా మారిపోతున్నాడు. ఇక VD అంటేనే స్టైల్ ఐకాన్ గా భావిస్తుంటారు ఫ్యాన్స్.

స్టైలింగ్ లో రౌడీని అనుసరించేవారు ఎందరో ఉన్నారు. ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా విజయ్ కు సరిగ్గా సరిపోతుంటాయి. ఇప్పుడు లేటెస్టుగా వీడీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో విజయ్ దేవరకొండ ఫార్మల్ మరియు క్యాజువల్ వేషధారణలో కూల్ అండ్ స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. ఒక ఫొటోలో సూటు బూటూ వేసుకొని రాయల్ గా సున్నితమైన యాటిట్యూడ్ తో కనిపిస్తుంటే.. మరొక దాంట్లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.

లైట్ గా గడ్డం పెంచుకొని న్యూ లుక్ లో దర్శనిమిచ్చిన విజయ్ ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం VD తన కొత్త సినిమా ''JGM'' కోసం ముంబైలో ఉన్నారు. ఈ మూవీ లాంచ్ సందర్భంగా తీసిన రౌడీ బాయ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ ఇప్పటికే పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో 'లైగర్‌' అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తి చేశారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వీడీ బాక్సర్‌ గా కనిపించనున్నాడు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ ‏గా నటిస్తోంది.

'లైగర్' చిత్రాన్ని 2022 ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే VD - పూరీ కాంబినేషన్ లో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 'JGM' (జనగణమన) అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాని మంగళవారం ముంబైలో అట్టహాసంగా ప్రారంభించారు.

యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సైనికుడిగా కనిపించనున్నారు. ఛార్మి కౌర్‌ - వంశీ పైడిపల్లి దీనికి నిర్మాతలు. 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ భాషల్లో 'JGM' విడుదల కానుంది.
Tags:    

Similar News