అందరున్నా స్టార్ డాటర్ మీదే కన్ను!

Update: 2017-11-03 11:30 GMT
బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నాడు షారూక్ ఖాన్. కింగ్ ఖాన్ భార్యగా మాత్రమే కాకుండా.. ఇతర ప్రొఫెషన్స్ ద్వారా కూడా చాలానే పేరు సంపాదించుకుంది గౌరీ ఖాన్. రీసెంట్ గా ఈమె ఓ పెద్ద పార్టీ ఇచ్చింది. ముంబైలో ఇలాంటి పార్టీలు చాలా కామన్ గానే జరుగుతుంటాయి కానీ.. ఈ పార్టీ మాత్రం సంథింగ్ స్పెషల్ అయిపోయింది.

ఇలా ఒక పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం.. షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. తల్లి ఇచ్చిన ఈ పార్టీలో సుహానా మెరిసిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గోల్డ్ కలర్ డ్రెసింగ్ తో మెరిసిపోయిన ఈ టీనేజర్.. ఏ మాత్రం బెదురు లేకుండా పార్టీ అంతా హంగామా చేసింది. తన మెరుపులతో మొత్తం పార్టీకొచ్చిన వారికి షాక్ కొట్టించేసింది. ఆ పార్టీకి ఎంత మంది స్టార్స్ వచ్చినా అందరిలోకీ సుహానాకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అమ్మడి ఫేస్ లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను చూసి ప్రతీ ఒక్కరూ షాక్ తినేశారట. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ టీనేజ్ భామ లక్ష్యం సినిమాల్లోకి రావడమే అంటారంతా.

ఈ విషయం షారూక్ ఖాన్ కు కూడా తెలుసునని.. కూతురు కోరికను ఏ మాత్రం ఖండించకుండా సపోర్ట్ చేస్తున్నాడని చెబుతుంటారు. ఇప్పటికిప్పుడు సినీ అరంగేట్రం చేసేయకపోవచ్చు కానీ.. రాబోయే కాలంలో మాత్రం స్టార్ హీరోయిన్ రేసులో సుహానా ఖచ్చితంగా ఉంటుందని బాలీవుడ్ టాక్.
Tags:    

Similar News