టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాలు హవా నడుస్తోంది. బాహుబలి నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వరుసగా పాన్ ఇండియా సినిమాలు బ్లాక్ బస్టర్ లు గా నిలవడంతో ఈ తరహా చిత్రాలపై ప్రేక్షకులతో పాటు మేకర్స్ లోనూ మరింత ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2` దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. తొలి రోజు ప్రారంభ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డుని సృష్టించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 676 కోట్లు వసూలు చేసి అతి తక్కువ రోజుల్లో ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టిన హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇప్పటికే బాహుబలి లైఫ్ టైమ్ వసూళ్లని అధిగమించిన ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త చరిత్రని సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ మేనియా పీక్స్ కి చేరిన నేపథ్యంలో ఈ మూవీ క్రేజ్, ఫలితాన్ని చూసిన చాలా మంది మేకర్స్ తమ లెక్కలని సరి చేసుకుంటున్నారు. అంతు కాకుండా తమ సినిమాకు మరింత ప్రత్యేతలని చేర్చి సకికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని స్క్రిప్ట్ లో ఇప్పడే మార్పులు చేసుకుంటున్నారు.
ఈ వరుసలో ముందున్న దర్శకుడు సుకుమార్. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప` దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. హిందీ బెల్ట్ లో అనూహ్యంగా 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడమే కాకుండా అక్కడ బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఫలితంతో బన్నీ తో పాటు దర్శకుడు సుకుమార్ టాక్ ఆఫ్ ది ఇండియా గా నిలిచారు. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు.
దీంతో పుష్ప ఫ్రాంచైజీని మరిన్ని ప్రత్యేకతలతో తెరపైకి తీసుకురావాలని గత కొన్ని రోజులుగా దర్శకుడు సుకుమార్ కసరత్తులు చేస్తున్నారు. లైన్, కీలక ఘట్టాలకు సంబంధించిన విషయంలో ఆలోచనలో పడిన సుకుమార్ `పుష్ప 2` స్క్రిప్ట్ ని పూర్తి చేసేందుకు యుఎస్ వెళ్లిపోయారు. అక్కడ ఓ రిసార్ట్స్ లో స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేసే పనిలో వున్నారు. ఇందు కోసం ఆయనకు మరో 15 రోజుల సమయం కావాలని అంటున్నారు. పద హేను రోజుల తరువాతే `పుష్ప 2` ఫైనల్ డ్రాఫ్ట్ ఓ కొలిక్కి రానుందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఫైనల్ డ్రాఫ్ట్ ఓ కొలిక్కి రాకుండానే మేకర్స్ మాత్రం అప్పుడే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు సంబంధించిన పనులు ప్రారంభించేశారు. ఇంకా కథే ఫైనల్ కాకపోవడం.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పుడే ప్రారంభం కావడంతో ప్రస్తుతం `పుష్ప 2` ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. `కేజీఎఫ్ 2` ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని `పుష్ప 2` ని మరింత పవర్ ఫుల్ గా మారుస్తున్నారట. ఇందుకు సంబంధించిన మరిన్ని విరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.