AMJ కోసం సుక్కూ..రాధే కోసం రాజమౌళి!

Update: 2022-03-03 05:30 GMT
స్టార్ డైరెక్ట‌ర్లు లేదా స్టార్ హీరోలు వాయిస్ ఓవ‌ర్లు ఇవ్వ‌డం అన్న‌ది ఇప్పుడే కాదు.. చాలా కాలంగా ఆచారణ‌లో ఉంది. ఇంత‌కుముందు ప‌వ‌న్ సినిమాల‌కు మ‌హేష్ .. మ‌హేష్ సినిమాల‌కు ప‌వ‌న్ ఈ త‌ర‌హా సాయం అందించారు. ఆ త‌ర్వాత కూడా ఈ క‌ల్చ‌ర్ ఇత‌ర యువ‌హీరోల్లో కొన‌సాగింది. అదంతా స‌రే కానీ ఇటీవ‌ల ఓ ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు వాయిస్ ఓవ‌ర్లు ఇవ్వ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆ ఇద్ద‌రూ ఎవ‌రు అంటే అందులో ఒక‌రు సుకుమార్ కాగా రెండో వారు రాజ‌మౌళి. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు (AMJ) కోసం సుకుమార్ వాయిస్ వోవ‌ర్ అందించ‌గా.. రాధేశ్యామ్ కోసం రాజమౌళి వాయిస్ అందించడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇందులో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన పాన్ ఇండియా సినిమాగా రాధేశ్యామ్ రికార్డుల‌పై క‌న్నేసింది.

దేశ‌విదేశాల్లో ప‌లు భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే శ‌ర్వా న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు కూడా భారీగా ఇరుగు పొరుగునా విడుద‌ల‌వుతోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళనాడు నుంచి మంచి వ‌సూళ్లను ఆశిస్తున్నారు.

ఇక పుష్ప సిరీస్ తో పాపులారిటీ అమాంతం పెంచుకున్న సుకుమార్ వాయిస్ వోవ‌ర్ ఏఎంజేకి ఇరుగు పొరుగునా క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు RRR ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి ప్ర‌భావం కూడా రాధేశ్యామ్ కి క‌లిసొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మార్చి 4న ఆడ‌వాళ్లు మీకు జోహార్లు విడుద‌ల కానుండ‌గా.. మార్చి 11న రాధేశ్యామ్ విడుద‌ల‌వుతోంది.



    

Tags:    

Similar News