నాని హీరోగా చేసిన 'అంటే .. సుందరానికీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. మైత్రీ బ్యానర్ తో సుకుమార్ కి మంచి అనుబంధం ఉంది. అంతేకాదు ఆల్రెడీ ఆ బ్యానర్లో 'పుష్ప' బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆయన, 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన పనిలో ఉన్నాడు. ఆ బ్యానర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వాళ్లు ఆహ్వానించడం .. సుకుమార్ రావడం జరిగింది. ఈ వేదికపై సుకుమార్ మాట్లాడాడు.
ఎదుటివారి టాలెంట్ ను గురించి చెప్పడానికి ఎక్కువ ధైర్యం కావాలి. ఆ ధైర్యం సుకుమార్ దగ్గర కావలసినంత ఉంది. కొత్త దర్శకులను అభినందించడానికీ.. తన తరువాత వరుసలో ఉన్న దర్శకులను మెచ్చుకోవడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడడు.
అలా ఆయన వివేక్ ఆత్రేయను ప్రశంసించాడు. అదే సమయంలో స్టేజ్ కి ఎదురుగా ముందు వరుసలో కూర్చున్న పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించాడు. 'భీమ్లా నాయక్' షూటింగు జరుగుతున్న సమయంలో నేను సెట్ కి వెళ్లాను.. అక్కడ త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ గారిని కలిశాను.
ఆ తరువాత త్రివిక్రమ్ గారు కలిసినప్పుడు.. "మొన్న నువ్వు కల్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయాసపడుతూ మాట్లాడావట. కాస్త హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పామన్నారు" అని అన్నారు.
నా ఆరోగ్యం బాగానే ఉంది సార్.. ఆ రోజున మిమ్మల్ని చూసిన ఆనందంలో అలా ఆయాస పడ్డాను అని సుకుమార్ చెప్పాడు. అక్కడితో ఆగితే నిజమే అనుకునేవారు. కానీ 'ఇప్పుడు యోగా చేస్తున్నాను.. బాగానే ఉంది' అని ఆయన కొసరు వేయడంతో , నిజంగానే సుకుమార్ హెల్త్ దెబ్బతిందనీ, పవన్ వెంటనే పసిగట్టేసి కేర్ తీసుకోమన్నారని చెప్పుకుంటున్నారు.
సుకుమార్ ఒక ప్రాజెక్టు ఓకే అయిన తరువాత అది పూర్తయ్యేవరకూ దానిని గురించే ఆలోచిస్తాడు. ప్రతి పాత్ర.. ప్రతి సీన్ పై కసరత్తు చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో ఆయన తన ఆరోగ్యాన్ని గురించి అంతగా పట్టించుకోడని చెప్పుకుంటూ ఉంటారు. సమయానికి భోజనం.. నిద్ర లేకపోవడం కారణంగా, కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. పవన్ చెప్పిన దగ్గర నుంచే యోగా చేస్తూ.. అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.