బాలీవుడ్ సీనియర్ స్టార్ సునీల్ శెట్టి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సునీల్ శెట్టి కొన్నాళ్ల పటు బాలీవుడ్ ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత కాలక్రమం పోటీ వాతావరణంలో ఎందుకనో ఆయన వెనుకబడ్డారు. సునీల్ కూడా నటనపై అనాసక్తిని చూపించారు. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఈక్రమంలో ఆ మధ్య తెలుగులో సైతం ఎంట్రీ ఇచ్చారు. 'మోసగాళ్లు'..'గని' లాంటి చిత్రాల్లో నటించారు.
తాజాగా సునీల్ ని బాలీవుడ్ తాజా పరిస్థితులపై స్పందించమంటే తనదైన శైలిలో చెలరేగారు. ఏకంగా బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. నేటి జనరేషన్ హీరోల్ని ఉద్దేశించి సునీల్ శెట్టి చెడుగుడు ఆడేసారు. ఇప్పుడున్న హీరోలంతా ఫ్యాషన్ తో రావడం లేదు. ఏదో మొక్కుబడిగా సినిమాలు చేస్తున్నారు.
అంతకుమించి వాళ్లలో అభద్రతా భావం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుత హీరోల కెరీర్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితులున్నాయి. అందుకు ఉన్న సమయంలోనే సంపాదించేయాలి అన్న టార్గెట్ గా పనిచేస్తున్నారు. డబ్బు మీద ఉన్న ధ్యాస వృత్తి మీద కనిపించడం లేదు. ఏహీరో అయినా తరచూ ప్రేక్షకుల్ని కలుస్తేనే మనలో లోపాలు ఉంటే తెలుస్తాయి.
కానీ మనోళ్లు ఇళ్లలో కూర్చుంటారు. సినిమా రిలీజ్ కి వారం ముందు కనిపిస్తారు. రిలీజ్ తర్వాత మళ్లీ అడ్రస్ కూడా దొరకరు. ఇలాగైతే వాళ్ల తప్పొప్పులు డిసైడ్ చేసేది ఎలా? ప్రేక్షకులు మన నుంచి ఏం ఆశిస్తున్నారు అన్నది నేరుగా వాళ్లనే అడిగి తెలుసుకోవాలి. మనకి నచ్చిన కథలతో పాటు అప్పుడప్పుడు ప్రేక్షకులకు నచ్చిన కథల్ని కూడా చేయగలగాలి.
ఆ కోణంలో ఇప్పుడెంత మంది హీరోలు ఆలోచిస్తున్నారు. హీరోల విషయంలో ప్రేక్షకులు చాలా తెలివిగా ఆలోచించ గల్గుతున్నారు. ఏ హీరో ఏకారు కొన్నాడు? ఎలాంటి రెస్టారెంట్ లో తిన్నాడు? ఎలాంటి ఇంట్లో ఉంటున్నాడు ? వంటి వాటికి కాలం చెల్లింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడా? లేదా? అందులో అతని పాత్ర ఎలా ఉందని లోతుగా విశ్లేషించే స్థాయికి ఆడియన్స్ పరిణతి చెందారు. రీల్ వేషాలు కాకుండా రియల్ గా మనుషులు ఎలా ఉంటున్నారు? అని చూస్తున్నారని సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.