వివాదాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రతి విషయానికి తనదైన లాజిక్ చెప్పే వర్మ.. ఆ మధ్యన ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన ఈ ట్వీట్ లో.. జనాల్ని అమితంగా ఆకర్షించే గుణం ఉన్న సన్నిలియాన్.. పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి రాజకీయ పార్టీ పెడితే సూపర్ హిట్ అవుతుందన్నారు. దీనిపై తాజాగా ఒక ప్రముఖ ఛానల్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వర్మ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
సన్నీ జాతీయ సెలబ్రిటీ అని.. పవన్ ప్రాంతీయ సెలబ్రిటీ అని.. ఇద్దరికి భారీ ప్రజాదరణ ఉండటంతో తాను ఆ పోస్ట్ పెట్టినట్లుగా సమర్థించుకున్నారు. ఆ మధ్యన సన్నిలియాన్ కొచ్చి వెళ్లినప్పుడు లక్షమంది సన్ని.. సన్ని అంటూ బహిరంగంగా అరుస్తున్నప్పుడు.. ప్రజల్లో క్రేజ్ ఉన్న ఇద్దరు కలిసి పార్టీ పెడితే మంచిదని చెప్పారు.
ఒక పోర్న్ స్టార్ ఇమేజ్ ఉన్న నటితో పవన్ ను పోల్చటం పవన్ అభిమానుల్ని బాధించింది కదా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో ట్విస్ట్ చేసిన వర్మ.. దేశం గురించి పవన్ మాట్లాడినట్లే.. అంతకు మించి చాలానే సన్నీ మాట్లాడుతుందని.. మరి.. ఇద్దరికి క్రౌడ్ ఫుల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పార్టీ పెట్టాలని తాను చెప్పటం తప్పు కాదన్నారు.
పోర్న్ స్టార్ ను చూసేందుకు జనాలు ఈ రకంగా వీధుల్లో ఎగబడటం.. ఆమెను చూసి సన్నీ.. సన్నీ అంటూ నినాదాలు చేయటం చూస్తే.. మనం ఎక్కడికి వెళుతున్నట్లు? అన్న ప్రశ్నకు స్పందించిన వర్మ.. దేశం పురోగతి సాధిస్తున్నట్లుగా చెప్పారు. అలాంటి వారిని తప్పు పట్టే వారిని ఆదిమమానవులుగా వర్మ అభివర్ణించటం గమనార్హం.
పవన్ కల్యాణ్ ఎంతో మెచ్యూర్డ్ ఆలోచనలతో రాజకీయాలు చేస్తుంటే.. సన్నీని ఎలా పోలుస్తారంటూ ప్రశ్నించినప్పుడు.. తాను మెచ్యూర్డ్ అన్న ఉద్దేశంతో ట్వీట్ చేయలేదని.. తన ట్వీట్ చివర్లో క్రౌడ్ ఫుల్లర్స్ అని పెట్టిన విషయాన్ని మర్చిపోకూడదు.. జనాన్ని విపరీతంగా ఆకర్షించే విషయంలో సన్ని. పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తాను ట్వీట్ చేశానని.. దాన్ని అలానే చూడాలంటూ ముక్తాయించారు వర్మ. మాటకారి అయిన మొండోడు ఎలా మాట్లాడతారో అచ్చం వర్మ అలా కనిపిస్తే తప్పు ఆయనది ఎంతమాత్రం కాదు సుమా.