సూపర్ స్టార్ కృష్ణ మరణవార్తతో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. తెలుగు తెర మీద ఆయన చేసిన అద్భుతాలను అన్ని గుర్తు చేసుకుంటూ ఘట్టమనేని అభిమానులు సినీ ప్రియులంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. ఒక గూఢచారిగా.. అల్లూరి సీతారామరాజుగా.. ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నాలుగు దశాబ్ధాల తన ప్రస్థానం కొనసాగించారు సూపర్ స్టార్ కృష్ణ.
ఇటీవల కాలంలో ఆయన మొదటి భార్య ఇందిరా దేవి మరణించడం ఆయన్ని మరింత క్రుంగిపోయేలా చేసింది. ఆదివారం హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. డాక్టర్లు ఎంత కష్టపడినా సరే కృష్ణని కాపాడలేకపోయారు.
మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు కృష్ణ తుది శ్వాస విడిచారు. బుర్రిపాలెం లాంటి చిన్న ఊరు నుంచి మద్రాస్ కు చేరుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు ఆయన. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా సరే స్వయం కృషితో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండేలా చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి నానక్ రామ్ గూడ లోని ఇంటికి కృష్ణ పార్ధివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం వరకు ఉంచి.. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్ లో పార్ధివ దేహాన్ని ఉంచనున్నారు.
తమ అభిమాన హీరో కృష్ణ మరణ వార్త విన్న అభిమానులు ఆయన్ని చూసేందుకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణ చివరి చూపు కోసం అభిమానులంతా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.
కృష్ణ పార్ధివ దేహానికి గురువారం అంత్య క్రియలు జరుపునున్నారు. పంజాగుట్ట మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. బుధవారమే అంత్యక్రియలు జరపాల్సి ఉన్నా అష్టమి రావడం వల్ల ఎల్లుండి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.