కరోనా కారణంగా థియేటర్ లు గత ఆరు నెలలుగా మూతబడి ఉన్నాయి. విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను ఏదోలా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా మరికొన్ని సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో చిన్న పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మి బాంబ్' సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
సౌత్ లో కాంచన పేరుతో వచ్చిన సినిమాను హిందీలో లారెన్స్ 'లక్ష్మిబాంబ్' పేరుతో రీమేక్ చేశాడు. మే నెలలోనే సినిమాను విడుదల చేయాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది. దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు డిస్నీ హాట్ స్టార్ అంతకు మించి ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు ఓకే చెప్పారంటూ వార్తలు వచ్చాయి. హాట్ స్టార్ వారు కూడా సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది. ఈనెల 9న అక్షయ్ కుమార్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయాలనుకున్నారు. కాని ఇప్పుడు విడుదల ఆగిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను కాస్త ఆగి థియేటర్ లలో విడుదల చేస్తేనే బాగుంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాను ఓటీటీ ద్వారా చూస్తే అంతగా ఆసక్తి ఉండక పోవచ్చు. అందుకే సినిమాను ఖచ్చితంగా థియేటర్ లోనే విడుదల చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ కారణంగానే సినిమాను ఓటీటీ కాకుండా థియేటర్ లో విడుదల చేసే ఆలోచనకు వచ్చాట. నిర్ణయం మార్పు విషయాన్ని యూనిట్ సభ్యలు అతి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.