సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్.. ఈ పేరు వింటే దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ పూనకంతో ఊగిపోతుంది. ఆయన స్టైల్ అన్నా, డైలాగ్స్ అన్నా ఆ క్రేజే వేరు. కార్పెంటర్, కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సినీ చరిత్రలో అగ్ర నటుడిగా ఎదిగిన సూపర్‌స్టార్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కేవలం దక్షిణాదినే కాకుండా యావత్తు భారత చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సెల్యూట్ చేస్తుంది. ఎందుకంటే.. ఆయన వ్యక్తిత్వమే కారణం అని చెప్పాలి. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన రజనీకాంత్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు రజనీ ఆరాధ్య నటుడుగా వెలిగిపోతున్నాడు.
కోట్లు ఉన్నా, స్టార్డమ్ ఉన్నా తలపొగరు, గర్వం లేని గొప్ప వ్యక్తి. ఆడంబరాలు ప్రదర్శించకుండా, అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ గొప్ప వ్యక్తిత్వాన్ని మరో సందర్భం రుజువు చేసింది. కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో భాగంగా వ్యక్తికీ వ్యక్తికి మధ్య సామాజిక దూరం పాటించాల్సి ఉంది. అయితే చాలామంది సెలబ్రిటీలు వారి ఇళ్లలో పనిచేసే పనివాళ్లను కూడా లోనికి రానివ్వడం లేదు. అలాంటిది సూపర్ స్టార్ రజినీ వాళ్ళింట్లో పనిచేసే పనివాళ్లను సైతం తన కుటుంబ సభ్యులుగా చూడటం ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం.
అంతేగాక ఇతరుల లాగా కాకుండా పనివాళ్లను దగ్గరగా తీసుకొని ఆప్యాయంగా పలకరించి మాట్లాడటం ఆయన వ్యక్తిత్వం. ఇటీవలే రజిని వాళ్ళింట్లో పనిచేసే పనిమనిషితో ఆప్యాయంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా పనివాళ్లను ఇళ్ల చుట్టుపక్కలకే రానివ్వడం లేదు అలాంటిది ఇంట్లోకి రానిచ్చి ఆప్యాయంగా మాట్లాడుతున్న తలైవాను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఆయన సింప్లిసిటీ ఆయనను ఇంత స్టార్ ని చేసింది అనడానికి నిరూపణగా ఈ ఫోటో నిలుస్తుండటం విశేషం.