'సైరా' క్లైమాక్స్.. సురేందర్ రెడ్డి క్లారిటీ

Update: 2019-09-18 13:39 GMT
ప్రస్తుతం చిరంజీవి నటించిన 'సైరా' సినిమా క్లైమాక్స్ చుట్టూ చాలా ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఆ విషయంపై చర్చ జరుపుతున్నారు. నిజ జీవితంలో ఉయ్యాల వాడ నర్సింహ రెడ్డిని బ్రిటిషర్స్ చాలా దారుణంగా హింసించి చివరికి ఉరి తీసి తలను వేలాడదీశారు.. ఇది నర్సింహ రెడ్డి చరిత్రలో ఓ భాగం. అక్కడితో ఆయన కథ ముగిసింది. అయితే సినిమాకి వచ్చే సరికి జరిగిన విషయాన్నే క్లైమాక్స్ గా తీసారా లేదా మార్పులు ఏవైనా చేసారా అనే సందేహం అందరికి కలుగుతుంది.

ఈ ప్రశ్నలన్నిటికీ క్లారిటీ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. లేటెస్ట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ లో క్లైమాక్స్ గురించి స్పందించాడు. ఇది చారిత్రాత్మక సినిమా అని ఆయన జీవితంలో జరిగిన విషయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పాడు. ఆయనను ఉరితీసి ముప్పై ఏళ్ల పాటు వేలాడదీశారు. అంటే ఆయన బ్రిటిష్ వాళ్ళని ఎంతగా భయపెట్టారో చూడండి. ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి జీవితంలో జరిగిన విషాదమే ఆయన సాధించిన గొప్ప విక్టరి. సో సినిమా సాడ్ ఎండింగ్ తో ముగిసినా అక్కడి నుండే అసలు యుద్ధం మొదలయిందని చెప్తూ తెరకెక్కించామని అన్నాడు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో చిరు చరణ్ ఎలాంటి విజయం నమోదు చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News