పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ అయిన క్రిష్ టైమ్ ఉందని ఒక చిన్న సినిమాను తెరకెక్కించాడు. కొండ పొలం అనే నవల ఆధారంగా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయినా కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే పవన్ తో హరి హర వీరమల్లు సినిమాను క్రిష్ మొదలు పెట్టాడు. మరో వైపు వైష్ణవ్ తేజ్ కూడా గిరీషయ్య దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు. క్రిష్ ఎలా అయితే పవన్ తో సినిమాకు ముందు ఒక చిన్న సినిమాను వైష్ణవ్ తో తెరకెక్కించాడో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఒక సినిమాను వైష్ణవ్ తేజ్ తో తెరకెక్కించి ఆ తర్వాత పవన్ మూవీని మొదలు పెట్టబోతున్నాడట.
చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ కు కరోనా అడ్డు తలిగింది. నెలలకు నెలలు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేస్తే కాని పవన్ ఆ సినిమాను మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. మరో వైపు సురేందర్ రెడ్డి కూడా అఖిల్ అక్కినేని తో సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా ను పూర్తి చేసి వెంటనే పవన్ తో మూవీ పట్టాలెక్కిస్తాడని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈయన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
వైష్ణవ్ తేజ్ మరియు సురేందర్ రెడ్డిల కాంబోలో సినిమా కు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. మీడియా సర్కిల్స్ లో ఈ సినిమా గురించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. అఖిల్ తో రూపొందిస్తున్న సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వైష్ణవ్ తేజ్ తో సురేందర్ రెడ్డి సినిమాను మొదలు పెడతారని అంటున్నారు. వైష్ణవ్ తేజ్ తో మీడియం బడ్జెట్ సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
అఖిల్ తో సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాను ముగించాల్సి ఉంది.. మరో వైపు వైష్ణవ్ తేజ్ కూడా ప్రస్తుతం చేస్తున్న గిరీశయ్య దర్శకత్వంలో సినిమా ను కూడా ముగించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి వరకు సురేందర్ రెడ్డి మరియు వైష్ణవ్ తేజ్ ల సినిమా పూర్తి అవుతుందని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అంటే ఈ ఏడాది చివరికి పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ మరియు హరి హర వీరమల్లు సినిమాల షూటింగ్ లు ఈ ఏడాది చివరి వరకు ముగిసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మరో రెండు సినిమాలను మొదలు పెట్టాలని పవన్ ప్లాన్ గా తెలుస్తోంది. క్రిష్ మాదిరిగానే పవన్ తో సినిమా కంటే ముందు వైష్ణవ్ తేజ్ తో సురేందర్ రెడ్డి కి కాకతాళీయంగానే జరుగుతున్నా కూడా అభిమానులు ఇదో సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ సినిమాల గురించిన మరింత సమాచారం త్వరలో వస్తుందని ఆశిద్దాం.