భారీ సినిమాలు టేకప్ చేయడానికి నిర్మాతలకు.. దర్శకులకు చాలా ధైర్యం ఉండాలి. నిర్మాణం ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి నిర్మాతలతో పాటుగా దర్శకుడికి కూడా ఆ ప్రెజర్ ఎక్కువే ఉంటుంది. గతంలో అయితే సినిమాకు యావరేజ్.. ఎబొవ్ యావరేజ్ లాంటివి ఉండేవి కాబట్టి దర్శకుడి కెరీర్ కు ఢోకా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సూపర్ హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుంది. హిట్ అయితే ఇబ్బంది ఉండదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఆ దర్శకుడిని పట్టించుకునేవారు ఉండరు. పెద్ద సినిమాలకు అన్నిటికీ ఇదే సమస్య. ప్రస్తుతం 'సైరా' దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రిలీజ్ ముందు ఉండే ప్రెజర్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం చాలా తక్కువమందికి లభిస్తుంది. దీంతో చిరుకు ఎలాగైన ఒక సక్సెస్ ఫిలిం అందించాలనే తపనతో సురేందర్ పని చేశారట. అయితే ఈ సినిమా ఒక సాధారణ సినిమా అయితే సురేందర్ రెడ్డికి ఇంత టెన్షన్ ఉండేది కాదేమో కానీ ఫ్రీడమ్ ఫైట్ నేపథ్యంలో తెరకెక్కడం.. 300 కోట్ల బడ్జెట్ పెట్టడంతో ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే విషయంలో ప్రెజర్ ఫీలవుతున్నారట. సినిమా ప్రోమోస్ ఎలా ఉన్నా ఆడియన్స్ తీర్పు ఇచ్చేది మాత్రం అక్టోబర్ 2 వ తారీఖునే. అది ఎలాగైనా ఉండొచ్చు. ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అటు 'బాహుబలి' తోనూ.. ఇటు 'సాహో' తోనూ పోలికలు మాత్రం తప్పడం లేదు. సినిమాలోని కంటెంట్.. విజువల్స్ అంతా బాగుంటే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కానీ ఏ విషయంలో లోటుపాట్లు ఉన్నా నెగెటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రభాస్ 'సాహో' కు ప్రోమోస్ తో సూపర్ క్రేజ్ వచ్చింది కానీ సినిమాకు మాత్రం మొదటి షో నుంచే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉండడంతో ఆ నెగెటివ్ టాక్ ను తట్టుకుని మరీ ఆ స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేయగలిగింది. ఒకవేళ 'సైరా' కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సరే కానీ అలా కాకుండా రివర్స్ లో జరిగితే 'సైరా'కు బాక్స్ ఆఫీస్ దగ్గర కష్టమేననే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది మెగాస్టార్ సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్టే ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.