అందుకే పరుచూరి వర్షన్ పక్కన పెట్టాడట!

Update: 2019-10-01 09:38 GMT
మెగా ప్రెస్టీజియాస్ మూవీ 'సైరా నరసింహ రెడ్డి' రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో స్టార్ దర్శకుల కేటగిరిలో చేరిన దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా గురించి మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధృవ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో చరణ్ డాడీతో సినిమా చేస్తావా అని అడిగారని ఇక ఆ తర్వాత చిరంజీవి గారితో ఓ కమర్శియల్ యాక్షన్ సినిమా అనుకోని అనుకోకుండా సైరా చేయాల్సి వచ్చిందని తెలిపాడు.

ఇక పరుచూరి బ్రదర్స్ దగ్గర కథ వినమని చిరంజీవి గారు చెప్పినప్పుడు వారి దగ్గరికి వెళ్లి కథ విన్నానని. కాకపోతే వారి వర్షన్ కంటే ఇంకా నెక్స్ట్ వర్షన్ రాయాలనిపించి మళ్ళీ తను రీ సెర్చ్ చేసి టీంతో కలిసి మరో వర్షన్ రాసుకున్నానని చెప్పాడు. అలా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గురించి తెలుసుకునే క్రమంలో తొమ్మిది వేలమంది ఆయన వెనుక ఉండడం చాలా ఆసక్తిగా అనిపించిందని, కేవలం ఒకే ఒక్కడిగా మొదలై ఆ తర్వాత జనంలో చైతన్యం తీసుకొచ్చిన తీరు సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా చెప్పొచ్చని అనిపించిందని అన్నాడు. ఆ పాయింట్ ను ఆదర్శంగా తీసుకొని సైరా కథను సిద్దం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి.

నిజానికి ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ కూడా చాలా రీ సెర్చ్ చేసారు. కొన్నేళ్ళ పాటు ఈ కథ రాయడం కోసం తర్జనభర్జన పడ్డారు. కాకపోతే అప్పటికి తెలుగులో బాహుబలి లాంటి సినిమా లేదు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది. కచ్చితంగా ఓల్డ్ వర్షన్ స్క్రీన్ ప్లేతో సినిమా చేస్తే బోల్తా కొడుతుంది. ఇప్పటి వారు కూడా మెచ్చేలా గొప్పగా సినిమాను తీయాలి. పైగా బాహుబలికి ధీటుగా ఉండాలి. ఇక్కడే సురేందర్ రెడ్డి జాగ్రత్త పడ్డాడు. పరుచూరి కథకు సూరి లేటెస్ట్ వర్షన్ స్క్రీన్ ప్లే రాసుకొని సినిమా చేసాడు. మరి సురేందర్ రెడ్డి తన వర్షన్ తో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.
Tags:    

Similar News