‘అల్లరి’ సినిమాతో డైరెక్టర్ గా మారిన నటుడు రవి బాబు ఆ తరువాత చిన్న సినిమాలతో ప్రయోగాత్మక కథలతో వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. పెద్ద్ స్టార్లు ఎవరు లేకుండా చిన్న సినిమాగా తీసి మంచి విజయాలను అందుకున్నాడు రవి బాబు. అవును2 తరువాత ఒక పందిపిల్ల చుట్టూ ఉన్న కథతో రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే కదా. అయితే సినిమా షూటింగ్ పూర్తి అయినా కూడా విడుదల ఎందుకు కాలేదు అనే అనుమానం కొంతమందికి వచ్చింది. దానికి అసలు కారణం ప్రొడ్యూసర్ సురేశ్ బాబు ఇలా చెప్పారు.
పంది పిల్ల ముఖ్య పాత్రలో ‘అదుగో’ అనే సినిమాను రవి బాబు డైరక్షన్లో రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయి దాదాపుగా 8 నెలలు అవుతుందట కానీ ఇంత వరకు విడుదల తేది మాత్రం నిర్ణయం కాలేదు. దానికి అసలు కారణం సురేశ్ బాబు ఏమి చెప్పాడు అంటే.. ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. ఈ కథ కూడా పంది పిల్ల చేసే కామిడీ చుట్టూ ఉంటుంది. విఎఫ్ ఎక్స్ కోసం మన దేశంలో చాలా స్టూడియోలను కలిసాము కానీ మేము అనుకున్నంతగా చేసి ఇవ్వలేకపోయారు. కొంతమంది మొదలుపెట్టి కొన్ని కారణాలు వలన వర్క్ ఆపేశారు. అంతే కాకుండా రవి బాబు కచ్చితత్వం కోసం ప్రాణం పెడతాడు. రవి బాబుని తృప్తిపరిచే స్టూడియో దొరకడం లేట్ అయ్యింది అందుకే సినిమా విడుదల కూడా లేట్ అయ్యింది అని చెప్పారు ‘అదుగో’ సినిమా ప్రొడ్యూసర్ సురేశ్ బాబు.
ఇప్పుడు గ్రాఫిక్స్ పనులు నడుస్తున్నాయి అని కూడా చెబుతున్నారు. ఈ సినిమాలో విఎఫ్ ఎక్స్ క్వాలిటి మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటాయి అంటా. విఎఫ్ ఎక్స్ వర్క్ అంతా అనుకున్న విధంగా జరిగిపోతే మరో రెండు నెలలో విడుదల చేస్తాము అని కూడా చెప్పారు ప్రొడ్యూసర్ సురేశ్ బాబు.