ఒక పుష్కరం వెనక్కి వెళ్తే.. తమిళ స్టార్ హీరో విక్రమ్ కు అప్పటికి తెలుగులోనూ సూపర్ ఫాలోయింగ్ ఉండేది. ‘అపరిచితుడు’ సినిమాతో అతను తెలుగులో తిరుగులేని ఆదరణ సంపాదించుకున్నాడు. అప్పుడే ‘శివపుత్రుడు’ కూడా విడుదలైంది. అది కూడా సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలో విక్రమ్ లీడ్ రోల్ చేస్తే.. సూర్య సహాయ పాత్రలో కనిపించాడు. అతడిని మన జనాలు పెద్దగా పట్టించుకోలేదప్పుడు. ఆ సినిమా హిట్టయ్యాక కూడా సూర్య పేరు జనాల్లో రిజిస్టర్ కాలేదు. కానీ ఏడాది తర్వాత ‘గజిని’ అనే సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ కావడంతో సూర్య కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపును సరిగ్గా ఉపయోగించుకున్నాడు. తెలుగు హీరోలతో సమానంగా ఇక్కడ ఆదరణ సంపాదించుకున్నాడు.
అప్పుడప్పుడూ కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా సరే.. తెలుగులో సూర్యకు ఉన్న ఫాలోయింగే వేరు. రజినీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ కథానాయకుడు సూర్యనే. అతడిని మన హీరోలాగే చూస్తారు మన ప్రేక్షకులు. ఈ సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’.. ‘జై సింహా’ లాంటి భారీ సినిమాలతో నేరుగా ఢీకొట్టేంత సత్తా సూర్య సినిమాకు వచ్చిందంటే చిన్న విషయం కాదు. ఈ సినిమాకు మంచి క్రేజ్ కూడా వచ్చింది. మరోవైపు సంక్రాంతికే తమిళంలో విక్రమ్ సినిమా ‘స్కెచ్’ కూడా రిలీజవుతోంది. కానీ ఆ చిత్రాన్ని తెలుగులో నేరుగా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. తమన్నా కథానాయిక అయినప్పటికీ ఆ సినిమాపై ఇక్కడ పెద్దగా ఆసక్తి లేదు. కొంచెం లేటుగా అయినా ఈ సినిమాను రిలీజ్ చేసినప్పుడు పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇందుకు గత దశాబ్ద కాలంలో విక్రమ్ మార్కెట్ అంతకంతకూ పడిపోతూ వచ్చి.. ఇక్కడ అతడి బేసే లేకుండా పోవడమే. ఒకప్పుడు తెలుగులో విక్రమ్-సూర్యల పరిస్థితి ఎలా ఉండేదో.. దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడుండటం విశేషం.