జైభీమ్ వివాదం... సూర్యకు ప్రముఖుల మద్దతు

Update: 2021-11-17 10:41 GMT
తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రథాన పాత్రలో నటించి స్వయంగా నిర్మించిన చిత్రం జై భీమ్‌. ఈ సినిమాలో గిరిజనులపై అప్పట్లో అక్రమ కేసులు బనాయించి ఎలా ఇబ్బందులు పెట్టేవారో చూపించడం జరిగింది. చెంచులు మరియు హరిజనుల గురించి ఈ సినిమాలో ప్రథానంగా చూపించడం జరిగింది. సినిమా విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఈ సినిమా ఓటీటీలో విడుదల అవ్వాల్సింది కాదు.. థియేటర్‌ లో రిలీజ్ అయ్యి ఉంటే మంచి వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ సూర్య అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా లో లాయర్ పాత్రలో సూర్య నటించాడు. అతడి నటనతో పాటు సినితల్లి పాత్రలో కనిపించిన అమ్మాయి నటన గురించి గత వారం రోజులుగా తెగ చర్చ జరిగింది. సినిమా పై ప్రశంసలు కురుస్తున్న సమయంలో అనూహ్యంగా వివాదం మొదలు అయ్యింది. ఒక వర్గం వారిని ఇందులో తప్పుగా చూపించారంటూ మొదలైన గొడవ చిలికి చిలికి అన్నట్లుగా పెద్దగా మారింది.

ఒక వర్గం వారికి అన్యాయం జరిగిందని చూపించడం కోసం వన్నియర్‌ సామాజిక వర్గంకు చెందిన వారిని విలన్స్‌ గా చూపించారంటూ ఆరోపణలు మొదలు అయ్యాయి. ఇప్పటికే వన్నియర్ సామాజిక వర్గం వారు కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది. జై భీమ్‌ సినిమాలో తమ సామాజిక వర్గం వారిని తప్పుగా చూపించి తమ మనోభావాలను దెబ్బ తీసినందుకు గాను అయిదు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా వన్నియర్‌ సామాజిక వర్గం గురించి మాట్లాడిందే లేదు. పోలీసు స్టేషన్ లో ఒక్క చోట వాల్‌ పై వన్నియర్ సామాజిక వర్గం కు సంబంధించిన చిహ్నం ఉందట. అది ప్రేక్షకులు కనీసం నోటీసు చేసే అవకాశం కూడా లేదు. అలాంటి విషయాన్ని పట్టుకుని వన్నియర్ సంఘం వారు వివాదాన్ని రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కొందరు చేస్తున్నారు.

ఈ సమయంలో సూర్యకు తమిళ సినీ జనాల నుండి అభిమానుల నుండి మద్దతు లభిస్తుంది. సోషల్ మీడియాలో #WeStandwithSuriya అనే హ్యాష్ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు. జై భీమ్ వివాదంలో సూర్యకు మద్దతుగా హీరో సిద్దార్థ్‌ సోషల్‌ మీడయాలో స్పందించాడు. అలాగే ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రి మారన్‌ కూడా సూర్యకు మద్దతుగా ట్వీట్ చేశాడు. సినిమా అద్బుతంగా ఉందని.. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం సూర్యకు మద్దతుగా నిలుస్తుందని.. ఇలాంటి ఒక మంచి సినిమాను ఇచ్చినందుకు యూనిట్‌ సభ్యులందరికి కూడా కృతజ్ఞతలు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సోషల్ మీడియా ద్వారా తమ మద్దతును సూర్యకు తెలియజేస్తున్నారు.

సూర్యపై సదరు సంఘం వారు వేసిన పరువు నష్టం దావా విషయంలో వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు తామంతా కూడా సూర్యకు మద్దతుగా నిలుస్తామని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. జై భీమ్‌ వివాదం నేపథ్యంలో సూర్య ప్రాణాలకు ప్రమాదం ఉందన్న అనుమానంతో ఆయన ఇంటికి భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సూర్య కు భారీ ఎత్తున భద్రత కల్పించడం చూస్తుంటే వన్నియర్‌ సామాజిక వర్గంకు చెందిన వారు భౌతిక దాడులకు కూడా పాల్పడే సమాచారం ప్రభుత్వంకు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సూర్య కు మద్దతుగా సెక్యూరిటీగా అభిమాలు కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.
Tags:    

Similar News