#BiggBoss5 : 19 మందిలో టాప్‌ 5 కి అర్హులు వీళ్లు

Update: 2021-09-07 04:30 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో షురూ అయ్యింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో కొంత అసంతృప్తి అయితే వ్యక్తం అవుతోంది. కొందరి మొహాలు మొదటి సారి చూడటం.. కొందరు ఫేమ్‌ లేని వారిని తీసుకు రావడం జరిగింది అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లంత ఎవరు అన్నట్లుగా మీమ్స్‌ బిగ్ బాస్ మీద బోలెడు పడుతున్నాయి. అయితే కంటెస్టెంట్స్ మొదటి వారం రెండు వారాల పాటు కొత్తగా అనిపించినా ఆ తర్వాత తర్వాత వాళ్ల ప్రవర్తన మరియు వారి ఆట తీరును బట్టి జనాల్లో ప్రాచుర్యం పొందుతారు. స్టార్‌ కంటెస్టెంట్స్ అనుకున్న వారు వారి ప్రవర్తన వల్ల ముందుగానే వెళ్లి పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే బిగ్‌ బాస్‌ మొదటి వారం నుండి అంచనాలు ఊహలు మొదలు అవుతూ ఉంటాయి. టాప్‌ 5 కంటెస్టెంట్స్ ఎవరై ఉంటారు అనేది చాలా మంది చాలా రకాలుగా చర్చలు జరుపుకుంటూ ఉంటారు.

బిగ్‌ బాస్‌ లో ఈసారి వచ్చిన 19 మందిలో టాప్‌ 5 కు వెళ్లగలిగే సత్తా ఉన్న వారు ఎవరు అనే విషయంలో సోషల్‌ మీడియాలో చర్చ మొదలు అయ్యింది. ముందుగానే తెలిసిన కొందరు కంటెస్టెంట్స్ తో పాటు మరి కొందరు కొత్త వారికి కూడా ఛాన్స్ ఉండవచ్చు అంటూ ఊహలు వినిపిస్తున్నాయి. అందరిలోకి మంచి ఫేమ్ ఉన్న యాంకర్‌ రవి ఖచ్చితంగా టాప్‌ 5 వరకు వెళ్లే సత్తా ఉన్న సమర్థుడు. ఆయన ఉంటే హౌస్‌ సందడిగా ఎనర్జిటిక్ గా ఉంటుంది అనే నమ్మకం అందరిలో ఉంది. కనుక ఖచ్చితంగా ఆయన టాప్‌ 5 లో ఉంటాడు అనే విషయంలో అనుమానం లేదు. ఇక సన్నీ కూడా తన జోవియల్‌ క్యారెక్టర్ తో అందరిని ఎంటర్ టైన్ చేస్తాడు. కనుక ఖచ్చితంగా సన్నికి కూడా ఛాన్స్ ఉంటుంది అనేది టాక్‌. ఇక ఫిజికల్‌ టాస్క్ ల విషయంలో విశ్వ కుమ్మేస్తాడు. అందువల్ల అతడికి ఫైనల్ వరకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక యూట్యూబ్‌ స్టార్‌ షన్ముఖ్‌ జశ్వంత్‌ కూడా ఫైనల్‌ వరకు ఉంటాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అయితే అతడు కాస్త ముభావంగా ఉంటున్నాడు. అలా కాకుండా అందరితో కలిసి పోయి జోవియల్‌ గా ఉండి టాస్క్‌ లో సీరియస్ గా తన ఎఫర్ట్‌ పెడితే ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ కు ఖచ్చితంగా టాప్‌ 5 లో ఉంటాడు అనేది టాక్. మానస్ కూడా ముందు ముందు మంచి ఎంటర్ టైనర్ గా పేరు దక్కించుకుని టాప్‌ 5 లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే మంచి ఎనర్జితో దుమ్ము రేపుతుంది అనే నమ్మకం సిరిపై చాలా మందికి ఉంది. ఆమెకు సోషల్‌ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది. కనుక ఆమె ఖచ్చితంగా టాప్‌ 5 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనేది టాక్‌.

ఎనర్జిటిక్ అమ్మాయి అయిన సరయు కూడా ఖచ్చితంగా ఫైనల్‌ వరకు వెళ్లే ఛాన్స్‌ ఉందంటున్నారు. ఇక ఆర్‌ జే కాజల్‌ కాస్త ఓవర్‌ యాక్షన్‌ తగ్గించుకుంటే టాప్‌ 5 కు వెళ్లే సత్తా ఉన్న అమ్మాయిగా చెబుతున్నారు. ఆని మాస్టర్‌ కూడా ఫైనల్‌ 5 కి అర్హురాలు అనడంలో సందేహం లేదు అంటున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఓ పది మంది జాబితా టాప్‌ 5 లో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఆ పది మందిలో ఎవరు టాప్‌ 5 కి వస్తారు.. ఆ పది మందిలోనే కాకుండా మిగిలిన 9 మందిలో కూడా టాప్‌ 5 కి అనూహ్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గత సీజన్ ల అనుభవాల దృష్ట్య ఏ సమయంలో పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. మోడల్ జెస్సీ గురించి మొదటి వారంలో వచ్చిన నెగిటివిటీ ఏదో ఒక సందర్బంలో పోయి ఫైనల్‌ వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి ఒక్క సందర్బం ఎవరో ఒకరికి వస్తే వారి క్రేజ్‌ మారిపోతుంది. కనుక బిగ్‌ బాస్ లో ఎప్పుడు ఎలా మారుతుంది అనేది చెప్పలేం. ప్రస్తుతానికి ఎవరికి వారు ఊహించుకోవడమే. వారం వారం ఈక్వెషన్స్‌ మారుతూ ఉంటాయి. మూడు నాలుగు వారాలు పోతె కాని మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News