తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలు థియేట్రికల్ రిలీజ్ భారీ వసూళ్లు సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ లు దక్కించుకుని చాలా కాలం అయ్యింది. మధ్య లో ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు.. కానీ అవి థియేటర్ రిలీజ్ అవ్వలేదు. ఆ రెండు సినిమాలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఆ రెండు సినిమా లు భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో థియేటర్ రిలీజ్ అయిన తాజా చిత్రం ఈటీ నిరాశ పరిచింది. పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తమిళనాట పర్వాలేదు అనిపించుకున్నా తెలుగు లో మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. థియేటర్ రిలీజ్ తో సక్సెస్ కొట్టాలన్న ఆశ అడియాశే అయ్యింది.
సూర్య థియేట్రికల్ సక్సెస్ దక్కించుకోకున్నా ఓటీటీ ద్వారా భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు థియేట్రికల్ బిజినెస్ జరగక ముందే ఓటీటీ బిజినెస్ ను ముగించేస్తున్నారు. ఇటీవలే ప్రకటించిన సూర్య 42వ సినిమా భారీ ఓటీటీ డీల్ ను సొంతం చేసుకుంది అంటూ తమిళ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.
మన తెలుగు నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ మరియు తమిళ నిర్మాణ సంస్థ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సూర్య 42 సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఈ సినిమా నుండి కేవలం ఇప్పటి వరకు ఒక పోస్టర్ మాత్రమే విడుదల అయ్యింది. అయినా కూడా ఒక ప్రముఖ ఓటీటీ ఈ సినిమా యొక్క అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఏకంగా 100 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
సూర్య గత సినిమాల యొక్క ఓటీటీ ప్రదర్శణ.. దక్కించుకున్న ఆదరణ ను బేరీజు వేసుకుని ఈ సినిమాకు ఈ స్థాయిలో పెట్టేందుకు సదరు ఓటీటీ ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ఈ ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యిందా.. ఇంకా చర్చలు జరుగుతున్నాయా అనే విషయం లో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.