సూర్య కథానాయకుడిగా నటించిన `జైభీమ్` ఇటీవల విడుదలై ఓటీటీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ ని మించిన గౌరవం దక్కించుకుంది ఈ సినిమా. చక్కని రివ్యూలతో క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. విమర్శకుల నుంచి సాధారణ ప్రజలకు వరకూ అందర్నీ ఆకట్టుకున్న చిత్రమిది. 1993 లో కస్టడీలో చంపబడిన భర్త రాజకన్నకు న్యాయం జరగాలంటూ భార్య పార్వతి అమ్మాళ్ చేసిన న్యాయపోరాటం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బడుగుబలహీన వర్గాల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చిన చిత్రంగా ప్రశంలందుకుంటోంది.
ఈ సినిమా చూసిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏకంగా సూర్యకి ఓ లెటర్ కూడా రాసారు. తాజాగా సూర్య రీల్ లైఫ్ లోనే కాదు రియల్ గాను మరోసారి హీరో అని ప్రూవ్ చేసారు. పార్వతి అమ్మాళ్ కుటుంబానికి సూర్య 10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసారు. ఈ మొత్తం పై నెల నెలా వచ్చే వడ్డీ పార్వతి అమ్మాళ్ కి చేరనుంది. తదనంతరం ఆమె పిల్లలకు అందజేస్తామని సూర్య తెలిపారు. అలాగే సినిమా చూసిన అనంతరం ఆ కుటుంబానికి రాఘవ లారెన్స్ సొంతంగా ఇల్లు కటిస్తానని ప్రామిస్ చేసారు. సామాజిక కార్యక్రమాల్లో సూర్య..లారెన్స్ ఎంత చురుగ్గా పాల్గొంటారో చెప్పాల్సిన పనిలేదు.
సొంతంగా ఇద్దరు హీరోలు వేర్వేరు గా చారిటీల పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాధ బాలల్ని చదివించడం.. వృద్ధాశ్రమాలు నిర్మించడం.. నిరుపేద పిల్లకు గుండె శస్ర్త చికిత్సలు చేయించడం వంటివి సూర్య ఫ్యామిలీ చాలా కాలంగా చేస్తోంది. సహాయం అడిగితే వెంటనే స్పందించే గొప్ప ధాతృ హృదయం గలవారు. ఇక జైభీమ్ పార్వతి అమ్మాళ్ పాత్రను సినతల్లి పాత్రగా మలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.