మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అంటే ఇంకా మూడు నెలలకు పైగానే సమయం ఉంది. అప్పటివరకూ ప్రేక్షకాభిమానుల్ని కొరటాల హోల్డ్ చేయాల్సి ఉంటుంది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత రిలీజ్ కి ఇంత గ్యాప్ అంటే సినిమాపై క్యూరియాసిటీ సన్నగిల్లడం సహజమే. అయితే మెగాస్టార్ సినిమా కాబట్టి అంచనాలు పీక్స్ లో ఉంటాయి. అయితే రిలీజ్ వరకూ అదే క్యూరియాసిటీని కొనసాగించాల్సిన బాధ్యత మేకర్స్ పై ఉంది.
కానీ యూనిట్ మాత్రం చడీచప్పుడు లేకుండా ఉండిపోవడం అభిమానుల్లో నిరాశనే మిగులుస్తోంది. సినిమా లాంచింగ్ తర్వాత కొన్ని పోస్టర్లు.. ప్రచార చిత్రాలు తప్ప ఇంకెలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగానైనా బిగ్ ట్రీట్ ఉంటుందని అభిమానులు భావించారు. కానీ నిరాశ తప్పలేదు. సోసోగానే కానిచ్చేసారు తప్ప ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ లేకుండా పోయింది. మెగాస్టార్ కెరీర్ లోనే సినిమా డిలే అవ్వడం అన్నది కూడా ఇదే తొలిసారి కావొచ్చు. పిరియాడిక్ చిత్రం `సైరా నరసింహారెడ్డి` లాంటి సినిమానే చాలా వేగంగా పూర్తిచేసి రిలీజ్ చేసారు. అయితే `ఆచార్య`కి కరోనా ప్రధాన సమస్యగా మారిన సంగతి గుర్తించాలి.
వైరస్ కారణంగా షూటింగ్ బాగా డిలే అయింది. ముందే అనుకున్న ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగలేదు. ఆ కారణంగానే షెడ్యూల్ మొత్తం మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే `ఆచార్య` జనవరి రిలీజ్ ఉండొచ్చని ఓ ఊహాగానం మాత్రమే. యూనిట్ అధికారికంగా రిలీజ్ ఎప్పుడు అన్నది ప్రకటించలేదు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చాయి. వైరస్ భయం తగ్గింది. లవ్ స్టోరీ సినిమాతో అది ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో `ఆచార్య` టీమ్ నుంచి రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన రావడానికి ఆస్కారం ఉంది. అది ఈ ఏడాది జరుగుతుందా? వచ్చే ఏడాదా? అన్నది మేకర్స్ మాత్రమే డిసైడ్ చేయాల్సి ఉంది.