ఏ హీరో అయినా తన మొదటి సినిమా సూపర్ హిట్ కావాలనే కోరుకుంటాడు. కానీ చాలా తక్కువమంది విషయంలో అలా జరుగుతూ ఉంటుంది. కానీ వైష్ణవ్ తేజ్ కి మాత్రం తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ పడింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ కుర్రాడు తన తొలి సినిమాగా 'ఉప్పెన' చేశాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమకథకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. భారీవసూళ్లతో పాటు విజయాన్ని తీసుకొచ్చి దోసిళ్లలో పెట్టారు. అప్పటికే వైష్ణవ్ తేజ్ .. క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' సినిమా చేసి ఉన్నాడు.
సాయిబాబు .. రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, వైష్ణవ్ తేజ్ జోడీగా రకుల్ నటించింది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందింది. కొండప్రాంతంలోని ఒక గిరిజన గూడానికి చెందిన ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమైంది. చాలా తక్కువ సమయంలో క్రిష్ పూర్తి చేసిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఈ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు కూడా. కానీ ఇప్పుడు ఈ సినిమా ఈ తేదీన థియేటర్లకు రావడం లేదని తెలుస్తోంది. దసరా రేస్ నుంచి ఈ సినిమా తప్పుకుందని అంటున్నారు.
ఇదే రోజున అఖిల్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించాడు. అఖిల్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో ఈషా రెబ్బా నటించగా, మిగతా పాత్రల్లో ఆమని .. మురళీశర్మ .. వెన్నెల కోశోర్ కనిపించనున్నారు.
అఖిల్ వరుసగా భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ఆయన రేంజ్ కి తగిన హిట్ మాత్రం ఇంతవరకూ పడలేదు. అలాంటి హిట్ కోసమే అఖిల్ వెయిట్ చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లకు రావడం ఆలస్యమైపోవడంతో ఆయన మరింత ఆసక్తితో ఉన్నాడు. ఈ సినిమాతో తాను అనుకున్న సక్సెస్ ను అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. ఇక ఆ తరువాత సినిమాగా ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' చేస్తున్న సంగతి తెలిసిందే.