హీరో కొడుకుతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు..

Update: 2018-08-12 01:30 GMT
స్టార్ లు వస్తే ఎగబడుతుంటారు.. కానీ వారి పిల్లలు వచ్చినా అదే క్రేజ్ ఉంటుందని ఓ వీడియోతో నిరూపితమైంది. తాజాగా బాలీవుడ్ అగ్రహీరో హీరోయిన్లు సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తైమూరుకు మూడేళ్లు వచ్చాయి. అందుకే అతడిని ప్లేస్కూల్లో వేశారు. కరీనా-సైఫ్ బిజీగా ఉండడంతో సైఫ్ చెల్లెలు సోహా తన పిల్లలతో పాటు మేనల్లుడు తైమూరును కూడా ప్లే స్కూలుకు రోజూ తీసుకొస్తుంది. అలా ఓ రోజు అభిమానుల కంట పడ్డాడు తైమూర్.

ఈ మురిపాల బుడ్డోడు  సోహా అలీఖాన్  తో కలిసి ప్లే స్కూలుకు వచ్చాడు. తైమూర్ ను ఓ ఆయా ఎత్తుకొని అక్కడే నిలబడింది.. ఈ స్టార్ కిడ్ ను చూసిన కొందరు అభిమానులు అతగాడితో సెల్ఫీ తీసుకోవాలని ఆరాట పడ్డారు.కానీ ఆయా దానికి ఒప్పుకోలేదు. ఓ యువకుడు బలవంతంగా వచ్చి సెల్ఫీ తీసుకున్నాడు. దీనికి ఆయా సీరియస్ అయ్యి ఆ బుడితడితో కలిసి స్కూల్ లోపలికి వెళ్లిపోయింది. ప్రస్తూతం ఈ  వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News