తెలుగు తెరపై విరిసిన తెల్ల గులాబీ తమన్నా. పాలప్రవాహంలో తేనెధారలు తేలినట్టుగా కనిపించే మేనిఛాయ తమన్నా సొంతం. అజంతా శిల్పాలు అసూయపడేలా .. అప్సరసలు సైతం ఆశ్చర్యపడేలా మెరవడం తమన్నా అందాల సహజ లక్షణం. ఆమె గూడు కట్టని కుర్రగుండె లేదు .. ఉక్కిరిబిక్కిరి చేయని హృదయం లేదు. అంతగా అభిమానుల మనసు పందిరిని ఆమె అల్లుకుపోయింది .. ఆక్రమించింది.
అందం విషయంలో తమన్నా ధాటినీ .. దాడిని తట్టుకోవడం ప్రేక్షకుల వలన కాలేదు. ఆమె స్పీడ్ ను అందుకోవడం .. అడ్డుకోవడం మిగతా హీరోయిన్ల వలన కాలేదు. మల్లెతీగలా కనిపించే ఈ సుందరి డాన్స్ విషయానికి వచ్చేసరికి మెరుపుతీగలా మారిపోతుంది. ఆ సమయంలో వానచినుకులు కూడా ఆమెను తాకలేవు .. తడపలేవు. అంతేసి గ్లామర్ కి .. ఇంతేసి టాలెంట్ ఉండటం వల్లనే ఆమె దూకుడు అలా కొనసాగుతోంది. అలాంటి తమన్నా తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సీటీమార్ సిద్ధమైంది.
సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన ఆమె కనువిందు చేయనుంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో ఆమె 'రచ్చ' సినిమా చేసింది. తమన్నా సహజంగానే మంచి అందగత్తె అయినప్పటికీ, ఈ సినిమాలో సంపత్ నంది ఆమెను మరింత గ్లామరస్ గా చూపించాడు. ముఖ్యంగా 'వాన వాన వెల్లువాయే' పాటలో తమన్నా స్టెప్పులకు, అప్పటివరకూ సీట్లలో కుదురుగా కూర్చున్న పడుచు మనసులన్నీ కళ్లాలు తెంపుకుని తెరవైపుకు పరిగెత్తాయి. అంతలా తడిసిన తమన్నా అందాలను చూపించడంలో సంపత్ నంది సక్సెస్ అయ్యాడు.
'రచ్చ' సినిమా చూసిన కుర్రాళ్లు ఆ అందాల దెబ్బ నుంచి కోలుకుంటూ ఉండగానే, సంపత్ నంది 'బెంగాల్ టైగర్' ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఎంత బెంగాల్ టైగర్ అయినా తమన్నా అందాలకు దాసోహం అనాల్సిందే .. అలసిపోయేలా ఆమె చుట్టూ తిరగాల్సిందే అనే విషయాన్ని నిరూపించాడు. ఈ సినిమాలో ''చూపులతో దీపాలా .. దేహముతో ధూపాలా' అనే పాటలో తమన్నాను చూసిన కుర్రాళ్లు 'ఇక మా వల్లకాదు గోపాలా' అనే అనుకున్నారు.
అంతటి సౌందర్య సంపదగా తమన్నాను చూపించిన సంపత్ నంది, ఇప్పుడు 'సీటీమార్'లోను అదే స్థాయిలో ఆమెను చూపించాడనే విషయం ఇంతవరకూ వచ్చిన ప్రచార చిత్రాల వలన అర్థమవుతోంది. మాస్ ఆడియన్స్ హుషారెత్తిపోయేలానే ఆమె ఈ సినిమాలో దుమ్మురేపేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతకాలమైనా తమన్నాలో అదే ఫిట్ నెస్ కనిపిస్తూ ఉండటం విశేషం. కబడ్డీ ఆటకే కాదు .. తమన్నా అందాలకు కూడా సీటీమార్ కొట్టడం ఖాయమేనని అనిపిస్తోంది. ఈ సినిమాతో సంపత్ నంది .. తమన్నా హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.