చెన్న‌య్ కి భ‌య‌ప‌డి హైద‌రాబాద్ RFC లో తిష్ఠ‌

Update: 2020-12-17 07:18 GMT
కోవిడ్ విల‌యం చెన్నై న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. దేశంలో అత్య‌ధిక కేసులు న‌మోదైన న‌గ‌రంగా చెన్నై రికార్డుల‌కెక్కింది. ఇక చెన్నైతో పోలిస్తే హైద‌రాబాద్ లో కోవిడ్ విస్త్ర‌తి త‌క్కువేన‌న్న‌ది స‌ర్వే. ఇక సిటీ ఔట‌ర్ లోని రామోజీ ఫిలింసిటీలాంటి చోట ఇంకా సేఫ్ అన్న భావ‌న నెల‌కొంది. దీంతో షూటింగుల కోసం తమిళ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు త‌రలి వ‌చ్చేస్తున్నారు. కేవ‌లం తంబీలే కాదు హిందీ ప‌రిశ్ర‌మ నుంచి షూటింగుల కోసం ఇక్క‌డికే ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ఇరుగు పొరుగు భాష‌ల నుంచి రామోజీ ఫిలింసిటీలో షూటింగుల‌కు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కొంత‌కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రామోజీఫిలింసిటీలోనే ఉన్నారు. తన రాజకీయ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించే విధంగా `అన్నాథే` చిత్రీకరణను ఒకే షెడ్యూల్ ‌లో పూర్తి చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీకి విచ్చేశారు.నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ తన కొత్త చిత్రం `కాతువాకుల రెండు కాదల్`ను ఇక్క‌డే చిత్రీక‌రిస్తున్నారు. విజయ్ సేతుపతి- నయనతార -సమంత త‌దిత‌ర స్టార్ల‌పై హైదరాబాద్ లో కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. అలాగే వారాంతంలో ఇక్కడ సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభించడానికి ధనుష్ ఈ వారాంతంలో హైదరాబాద్ కి వ‌స్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇంకా అనేక చిన్న కోలీవుడ్ సినిమాల షూటింగులు సాగుతున్నాయి. సూర్య‌- అజిత్- కార్తీ  తమ సినిమాల చిత్రీకరణను హైదరాబాద్ లో ముగించారు. దేవ‌గ‌న్-ర‌కుల్ `మేడే` షూటింగ్ రామోజీ ఫిలింసిటీలోనే సాగింది.

తమిళనాడు స‌హా చెన్నైలో కోవిడ్ విల‌యం కారణంగా కోలీవుడ్ నిర్మాత‌లు హైద‌రాబాద్ -ఆర్.ఎఫ్‌.సీకే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఇత‌ర పెద్ద మెట్రో న‌గ‌రాల‌తో పోలిస్తే ఇక్క‌డ సేఫ్ అన్న భావ‌న నెల‌కొంది. ఆ ర‌కంగా బాలీవుడ్ సినిమాలు స‌హా ప‌లు భాష‌ల చిత్రాల‌కు షూటింగుల ప‌రంగా ఆర్.ఎఫ్.సీకే విచ్చేస్తున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News